
India Vs Australia 3rd Odi Chepauk: సమ ఉజ్జీల పోరాటం ఎలా ఉంటుందో… ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కళ్ళకు గడుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా చెరొక వన్డే గెలిచాయి. దీంతో బుధవారం చెన్నైలో జరిగే మూడే వన్డే పై అందరి దృష్టి పడింది.. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్ దక్కుతుంది. ఈ సిరీస్ దక్కాలి అంటే చేపాక్ లో ఆస్ట్రేలియాకు ఇండియా జట్టు చెక్ పెట్టాలి. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో భారత్ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో భారత్ ఆస్ట్రేలియాను ఎలా నిలువరిస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నప్పటికీ జట్టు స్కోరు కనీసం 120 కూడా దాటకపోవడం విశేషం. ఈ స్వల్ప స్కోరును ఆస్ట్రేలియా వికెట్ పోగొట్టుకోకుండా ఛేదించింది. దీంతో వన్డే సిరీస్ ను 1_1 తో సమం చేసింది.
ఇక రెండో వన్డేలో ఓడిపోయిన నేపథ్యంలో భారత జట్టు మార్పులకు శ్రీకారం చుడుతుంది అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే చెన్నై లోకల్ హీరో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. చేపాక్ స్టేడియం స్పిన్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జట్టు వైపు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అతడిని ఆడించాలని జట్టు భావిస్తే అక్షర్ పటేల్ పై వేటు పడే అవకాశం ఉంది. ఈ ఒక్క స్థానానికి మించి జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు కల్పించడం లేదు. ఒకవేళ ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్య ఎదుర్కొంటే మార్పులు తప్పకపోవచ్చు.

వన్డేల్లో విఫలమవుతున్న సూర్య కుమార్ యాదవ్ కు ఈ మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం దక్కొచ్చు. ఎందుకంటే అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆట గాడు జట్టులో లేకపోవడంతో అతడికి అవకాశాలు ఇస్తున్నారు. ఒకవేళ కిషన్ ను ఆడించాలనుకుంటే సూర్య పై వేటు తప్పకపోవచ్చు. విశాఖ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సూర్యకు మరో అవకాశం ఇస్తామని హిట్ ఇచ్చాడు. అయ్యర్ ఎప్పుడు జట్టులోకి వస్తాడో తెలియదు కాబట్టి.. సూర్య తప్ప మాకు వేరే ఆప్షన్ లేదని రోహిత్ వివరించాడు. ఇక తెల్లబంతి మీద తాను ఏమిటో నిరూపించుకున్నాడు కాబట్టి.. కచ్చితంగా సూర్యకే అవకాశం ఇస్తామని రోహిత్ వివరించాడు.
ఇక రెండు మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమైన శుభమన్ గిల్ మూడే వన్డే లోనూ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. కెప్టెన్ రోహిత్ కూడా విశాఖపట్నం వన్డేలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరి జోడి మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ విశాఖపట్నం వన్డేలో కుదురుకున్నట్టు కనిపించినప్పటికీ.. ఇన్ స్వింగర్ డెలివరీకి అవుట్ అయ్యాడు.. విరాట్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక సూర్య కుమార్ యాదవ్ కు ఇది డు ఆర్ డై మ్యాచ్. తొలి వన్డేలో జట్టును గెలిపించిన కేఎల్ రాహుల్.. రెండో వన్డేలో మాత్రం తేలిపోయాడు. అతడు కూడా మొదటి వన్డే స్థాయి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఇక హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రదర్శన చేయాల్సి ఉంది. మొదటి వన్డేలో కీలకంగా ఆడిన రవీంద్ర జడేజా.. రెండో వన్డేలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో జట్టు అతడి నుంచి ఆల్ రౌండర్ ప్రదర్శన ఆశిస్తోంది.
బౌలింగ్ విభాగం మొదటి వన్డేలో సత్తా చాటినప్పటికీ.. రెండో వన్డేలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ నుంచి జట్టు మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. లోకల్ బాయ్ సుందర్ ను గనుక ఆడించాలనుకుంటే అక్షర్ బెంచ్ కే పరిమితమవుతాడు. ప్రధాన పేపర్లు మహమ్మద్ సిరాజ్, షమీ విషయంలో జట్టు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ షమీ కి ఇవ్వాలి అనుకుంటే జయదేవ్ లేదా ఇమ్రాన్ మాలిక్ లో ఎవరో ఒకరు జట్టులోకి వస్తారు.
జట్టు అంచనా ఇలా
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, హార్దిక్ పాండ్యా ( వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/ వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, షమీ/ ఉమ్రాన్ మాలిక్, సిరాజ్.