
KL Rahul: రాహుల్ ఆట మారదు. అతను కూడా మారడు. నిరూపించుకునేందుకు బీసీసీఐ వరుసగా అవకాశాలిస్తున్నా అతను తేలిపోతున్నాడు.. పేలవమైన ఆట తీరుతో పెవిలియన్ చేరుతున్నాడు. మొదటి టెస్టులో దారుణంగా విఫలమైన అతడు.. రెండవ టెస్టులోనూ అదే ఆట తీరు కనబరిచాడు. గింగిరాలు తిరుగుతున్న బంతిని అంచనా వేయలేక అవుట్ అవడం రాహుల్ కు పరిపాటిగా మారింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో ఆస్ట్రేలియాలో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ రెండవ రోజు ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మతో బరిలోకి దిగిన రాహుల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లను సొంత మైదానంలో ఎదుర్కోవడంలో తీవ్రమైన ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా లయాన్ బౌలింగ్లో అతడు పూర్తి ఆత్మ రక్షణ ధోరణిలో ఆడాడు.. అతడి మైనస్ పాయింట్ కనిపెట్టిన లయాన్ ఆఫ్ స్టంప్ అవతల బంతులు వేశాడు. మైదానం మీద తేమ ఉండడంతో అది గింగిరాలు తిరుగుతోంది. ఆ బంతులను అంచనా వేయలేక రాహుల్ పడ్డ ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.

ఇక అందరూ ఊహించినట్టే లయాన్ బౌలింగ్లో రాహుల్ వ్యక్తిగత స్కోరు 17 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎల్ బి డబ్ల్యూ గా అవుట్ అయ్యాడు.. లయాన్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన రాహుల్ దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు.. అది క్లియర్ గా రాహుల్ ప్యాడ్లను తాకడంతో లయాన్ ఎంపైర్ రివ్యూ కోరగా… అతడు అవుట్ ఇచ్చాడు.. దీంతో నిరాశగా రాహుల్ మైదానాన్ని విడాల్సి వచ్చింది. కాగా రాహుల్ అవుట్ అయిన విధానాన్ని నెటిజన్లు పలు విధాలుగా ట్రోల్ చేస్తున్నారు..” రాహుల్ భయ్యా… ఇక మారవా.. నీ ఈ ఆట కోసమేనా గిల్ లాంటి ఆటగాడిని టీం పక్కన పెట్టింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
KL Rahul contribution for Team India in 2nd Test be like🥹 #KLRahul#IndVsAus2023 #INDvAUS pic.twitter.com/Fl5aPCbG6E
— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) February 18, 2023