
Chiranjeevi- Ram Charan: చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చెప్పాలంటే ఫేమ్ లో ఆయన్ని కూడా మించిపోయాడు. ఒక్కో సినిమాకు తనను తాను మార్చుకుంటూ లోపాలను అధిగమిస్తూ టాప్ స్టార్ రేంజ్ కి వచ్చాడు. ఒక స్టార్ హీరో కొడుకుగా ఆయనకు ఆరంభం మాత్రమే దక్కింది. అక్కడ నుండి తన ఎదుగుదలకు అవసరమైన మెట్లు తానే నిర్మించుకున్నాడు.దాదాపు 16 ఏళ్ల కెరీర్లో పలు బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ చూశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ నటన అద్భుతం. రామరాజుగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో చరణ్ జీవించారు.
ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో రామ్ చరణ్ నటన గురించి దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ అరుదైన సంఘటనపై చిరంజీవి స్పందించారు. జేమ్స్ కామెరూన్ వీడియో షేర్ చేస్తూ తన మనోభావాలు పంచుకున్నారు. చరణ్ పై మీరు చేసిన ప్రశంస ఆస్కార్ కి మించిన గౌరవం. చరణ్ ఈ స్థాయికి రావడంపై ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. మీ ప్రశంసలు చరణ్ భవిష్యత్ కి దీవెనలు వంటివి… అంటూ ట్వీట్ చేశారు.
ఈ విషయాన్ని యాంటీ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ దే అన్నట్లు కామెరూన్ పొగడ్తల విషయంలో చిరంజీవి స్పందించారని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇక్కడ విమర్శించాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద దర్శకుడు కొడుకు గురించి మాట్లాడినప్పుడు తిరిగి చిరంజీవి కృతజ్ఞతా పూర్వకంగా ట్వీట్ చేశారు. ప్రతి వ్యక్తి తమ పిల్లల విజయాలను సెలబ్రేట్ చేసుకుంటారు. వారు మరింత ఎదిగేందుకు ప్రోత్సాహం, మోరల్ సప్పోర్ట్ ఇస్తారు. చిరంజీవి ఇక్కడ చేసింది అదే. రామ్ చరణ్ ని చూసి గర్వంగా ఉందన్న మాత్రానా చిత్ర దర్శకుడు రాజమౌళినో మరో హీరో ఎన్టీఆర్ నో కించపరిచినట్లు కాదు.

తప్పులు వెతకాలనే ఆలోచన ఉన్నప్పుడు మంచిలో కూడా చెడు చూడవచ్చు. ఆర్ ఆర్ ఆర్ విజయం అందరి సమిష్టి కృషి ఉంది. అందులో రామ్ చరణ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఆర్ ఆర్ ఆర్ స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఒక మాటన్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో చరణ్ పాత్ర చాలా కష్టమైనది. విలక్షణతో కూడుకుని ఉంటుందని చెప్పారు. పైకి నెగిటివ్ గా కనిపించే పాజిటివ్ రోల్ అని చెప్పారు. అలాంటి ఛాలెంజింగ్ రోల్ కి చరణ్ వంద శాతం న్యాయం చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. అది కొందరు అంగీకరించకలేకపోతున్నారు.