
India vs Australia: బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో న్యూఢిల్లీలో రెండవ టెస్ట్ ఆడుతున్న భారత్… ఆస్ట్రేలియా బౌలర్ లయాన్ ధాటికి వణికి పోతోంది.. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్లు పుజారా, కేఎల్ రాహుల్ వెంట వెంటనే అవుట్ కావడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరికీ వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని చురకలు అంటిస్తున్నారు. మొదటి టెస్టులో విఫలమైన వీరు.. రెండవ టెస్టులోనూ అదే తీరు కనబరిచారు. మొదటి టెస్టులో రాణించకపోయినప్పటికీ టీం మేనేజ్మెంట్ గిల్ లాంటి ఆటగాళ్లను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసి.. ఈ ఇద్దరికీ అవకాశం ఇచ్చింది.
కానీ ఈ అవకాశాన్ని వారిద్దరూ సద్వినియోగం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా రాహుల్ అయితే తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అతను వరుసగా విఫలమవుతున్నప్పటికీ… కెప్టెన్, కోచ్ అండదండలతో జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. వైస్ కెప్టెన్సీ కూడా అతడికి రక్షణగా మారింది. అయినప్పటికీ అతడు ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు.రెండో టెస్టులోనూ ఒత్తిడిలోనే ఆడిన రాహుల్… ఒక భారీ సిక్సర్ తో టచ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. అని తన టెక్నిక్ లోపంతో మరోసారి ఎల్ బి డబ్ల్యు గా వెనుదిరిగాడు. నాథన్ లయన్ బౌలింగ్లో ఆఫ్ స్టంప్ వైపు వెళ్తున్న బంతిని డిఫెన్స్ చేసే ప్రయత్నంలో వికెట్ల ముందు దొరికిపోయాడు.
మరోవైపు కెరియర్లో 100వ టెస్టు ఆడుతున్న పూజార డక్ ఔట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయిన పుజారా… ఫీల్డ్ ఎంపైర్ ఘోర తప్పిదంతో పాటు ఆస్ట్రేలియా రివ్యూ తీసుకోకపోవడంతో బచాయించాడు.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు.లయన్ వేసిన మరుసటి ఓవర్ లోనే ఎల్బి గా వెనుతిరిగాడు. అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా.. ఆస్ట్రేలియా రివ్యూ తీసుకొని వికెట్ సాధించింది.

ఇక ఈ ఇద్దరి వైఫల్యం టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడిని పెంచింది. క్రీజులో సెట్ అయిన రోహిత్ సైతం వీరి వల్లే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. అతను కూడా లయన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, జడేజా ఉన్నారు.. వీరు ఆచితూచి ఆడుతున్నారు. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడం వీరిపై ఒత్తిడి పెంచింది. కాగా రాహుల్, పుజారా పై అభిమానులు మండిపడుతున్నారు. ఈ ఇద్దరి కోసం గిల్, జయ కుమార్ యాదవ్ ను పక్కన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన బ్యాటింగ్ తో జట్టుకు భారంగా మారారని, వీరి వల్ల ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. కపిల్ దేవ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం రాహుల్ ను పక్కన పెట్టాలని సూచిస్తున్నప్పటికీ.. రాహుల్ ద్రావిడ్ మాట వినడం లేదని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ద్రావిడ్ జట్టును నాశనం చేస్తున్నాడని మండిపడుతున్నారు. మ్యాచ్ ప్రాక్టీస్ లేని శ్రేయస్ అయ్యర్ ను నేరుగా ఆడించడాన్ని కూడా తప్పుపడుతున్నారు.
#QuickByte – :
D Vengasrkar v NZ (1988)
A Border v WI (1988)
C Walsh v ENG (1998)
M Taylor v ENG (1998)
S Fleming v SA (2006)
A Cook v AUS (2013)
B McCullum v AUS (2016)
()#INDvAUS | #CheteshwarPujara pic.twitter.com/2yETxcRUfQ— Cricket.com (@weRcricket) February 18, 2023