
Punarnavi Bhupalam: బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం గురించి తెలియని వారుండరు. బిగ్ బాస్ షోతో పునర్నవి ఫేమస్ అయ్యారు. సీజన్ 3 లో పాల్గొన్న పునర్నవి కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ తో సన్నిహితంగా ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ షోలో లవ్ ఎఫైర్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది వీరే. అంతకు ముందు రెండు సీజన్స్ లో లవర్స్ గా పాపులర్ అయిన కంటెస్టెంట్స్ ఎవరూ లేరు. రాహుల్-పునర్నవి లవ్ ట్రాక్ అద్భుతంగా సక్సెస్ అయ్యింది. మంచి టీఆర్పీ రాబట్టింది. ఆ సీజన్ విన్నర్ రాహుల్ కావడం విశేషం. పునర్నవి మాత్రం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.
కొన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్లో మొదలైన స్నేహాన్ని ఈ జంట కొనసాగించారు. పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. మెల్లగా ఎవరి దారులు వారివి అయ్యాయి. జనాలు కూడా ఈ జంట గురించి మర్చిపోయారు. పునర్నవి యాక్టింగ్ నుండి బ్రేక్ తీసుకుంది. పై చదువుల కోసం లండన్ వెళ్లిన ఈ బ్యూటీ అక్కడే ఉంటున్నారు. అయితే ఆమె గర్భవతి అయ్యారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కథనాలు ప్రసారం చేశాయట. ఈ వీడియోలు పునర్నవి దృష్టికి వెళ్లడంతో ఆమె ఫైర్ అయ్యారు. ఇంస్టాగ్రామ్ వేదికగా స్పష్టత ఇచ్చారు.
తన పొట్ట చూపిస్తూ ఒక పిక్ పోస్ట్ చేసిన పునర్నవి… నా బెస్ట్ ఫ్రెండ్ ఒక గే. అతనితో నేను గర్భవతిని అయ్యానా?. యూట్యూబ్ ఛానల్స్ నన్ను ప్రెగ్నెంట్ ఉమన్ చేశాయి. ఆ మధ్య హెల్త్ బాగోలేదని చెప్పినందుకు చనిపోతున్నానని రాశారు. దారుణమైన నాన్ సెన్స్ ప్రచారం చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుంటే మరోపక్క ఇలా దిగజారుడు వ్యవహారాలు కూడా చోటు చేసుకుంటున్నాయి…. అంటూ పునర్నవి తీవ్ర అసహనం ప్రదర్శించారు.

పునర్నవి టీనేజ్లోనే సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. 2014లో విడుదలైన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఉయ్యాలా జంపాలా మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేశారు. పిట్టగోడ, ఒక చిన్న విరామం, సైకిల్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. 2020 తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. కమిట్మెంటల్ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన పునర్నవి లండన్ లో పీజీ చేస్తున్నట్లు సమాచారం.