Nagababu Kirrak RP : కూకట్ పల్లిలో ‘నెల్లూరు పెద్దారెడ్డి’ చేపల పులుసు సక్సెస్ కావడంతో విస్తరణ బాటపట్టాడు జబర్ధస్త్ ఒకప్పటి కమెడియన్ కిరాక్ ఆర్పీ. జబర్ధస్త్ లో కమెడియన్ గా నవ్వులు పూయించిన ఇతడు బయటకొచ్చి ఓ 40 లక్షల పెట్టుబడితో ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉండే కూకట్ పల్లిలో ఈ చేపల పులుసు కర్రీపాయింట్ పెట్టగా బాగా సక్సెస్ సాధించింది. భారీగా లాభాలు వచ్చాయి. ఆ 40 లక్షలు అప్పులు తీరడంతోపాటు మిగులు సాధించాడు. మంచి స్పందన వచ్చింది. దీంతో విస్తరణ బాటపట్టాడు.
తాజాగా సినీ సెలబ్రెటీలు.. ద్వితీయశ్రేణి నటనటులు, ప్రముఖులు ఉండే మణికొండలో ‘నెల్లూరు పెద్దారెడ్డి’ చేపల పులుసు రెండో దుకాణాన్ని ఆర్పీ ప్రారంభించాడు. ఈ దుకాణం ప్రారంభోత్సవానికి మెగా బ్రదర్ నాగబాబు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఆయన చేసిన కామెంట్స్ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా అసలు తాను తొలి షాప్ ఓపెనింగ్ కే రావాల్సింది అని.. ఆర్పీ పిలిచాడని.. కానీ తనతో ఫస్ట్ వ్యాపారం ప్రారంభిస్తే హిట్ కాకుంటే వాడు తిట్టుకుంటాడని రాలేదని నాగబాబు తెలిపారు. ఆ బిజినెస్ సక్సెస్ కావడంతో రెండో షాప్ ఓపెనింగ్ కు వచ్చానని నాగబాబు తెలిపారు.
ఆర్పీ ఊపు, పట్టుదల చూస్తుంటే వీడు దుబాయ్, సౌదీని కూడా ఆక్రమించేసి అక్కడ చేపల పులుసు దుకాణాలు పెట్టేలా ఉన్నాడని.. వీడి బిజినెస్ పెద్ద సక్సెస్ కావాలంటూ ఆశీర్వదించాడు.
ఈ సందర్భంగా ఆర్పీని ‘వీడు అనడం కరెక్ట్ కాదని.. సక్సెస్ అయిన ఆర్పీని ఆర్పీ గారు అంటూ సంబోధించి నాగబాబు నవ్వులు పూయించారు. ఆర్పీ మాత్రం మీరే మా బాస్ నాగబాబు గారు మీరు ఏమన్నా ఫర్వాలేదు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తానికి జబర్ధస్త్ నుంచి బయటకొచ్చిన ఆర్పీకి వెన్నుదన్నుగా నిలబడి మరీ ప్రోత్సహిస్తున్న నాగబాబుకు అక్కడున్న వారంతా కృతజ్ఞతలు తెలిపారు.