https://oktelugu.com/

IndiGo: ఇండిపెండెన్స్ డే స్పెషల్: ఇండిగో కీలక నిర్ణయం.. కొత్తగా 77 మందికి జాబ్ ఆర్డర్స్

ప్రయాణికుల మన్ననలు పొందడంలో భాగంగా తమ సేవలు మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేసింది. అతి చవకైన విమానయాన సంస్థగా ఇండిగో కు పేరుంది. సాధారణ తరగతి సీట్లు మాత్రమే ఈ విమానాల్లో కనిపిస్తాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 15, 2024 2:34 pm
    IndiGo

    IndiGo

    Follow us on

    IndiGo: దేశంలో విమానయాన సేవలు అందిస్తున్న ఇండిగో స్వాతంత్ర దినోత్సవాల వేళ పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 77 ఏండ్లు పూర్తయి 78వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా 77 మంది మహిళా పైలెట్లను కొత్తగా విధుల్లోకి తీసుకున్నట్లు ఇండిగో యాజమాన్యం బుధవారం (ఆగస్ట్ 14) రోజున ప్రకటించింది. దీంతో సంస్థలో ఇప్పటి వరకు ఉన్నవారితో కలిపి, మహిళా పైలెట్ల సంఖ్య 800కు పెరిగింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు విస్తృతమైన సేవలు అందించడంలో ఇండిగో ఎప్పుడూ ముందుంటుందని వారు చెప్పుకొచ్చారు. ఇండిగో ప్రస్థానంలో ఇదో మైలురాయి అని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటించడం తమకెంతో సంతోసాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇండిగో విమానయాన సంస్థ తమ సంస్థలో చేర్చుకున్న 77 మంది మహిళా పైలెట్లలో 72 మంది వరకు ఎయిర్ బస్ విమానాలు నడుపుతారని పేర్కొంది. మిగతా ఐదుగురు ఏటీఆర్ విమానాలు నడిపేందుకు నియమించినట్లు చెప్పారు. సంస్థలోని పైలెట్ల వారీగా చూసుకుంటే అంతర్జాతీయ సగటు 7 నుంచి 9 శాతంగా ఉంది, ఇండిగోలో సగటు 14 శాతానికి చేరిందని వెల్లడించింది.

    ప్రయాణికుల మన్ననలు పొందడంలో భాగంగా తమ సేవలు మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేసింది. అతి చవకైన విమానయాన సంస్థగా ఇండిగో కు పేరుంది. సాధారణ తరగతి సీట్లు మాత్రమే ఈ విమానాల్లో కనిపిస్తాయి. ఢిల్లీ లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో తన సేవలను ఎక్కువగా అందిస్తుంటుంది. అత్యధిక లాభాలు గడించే ఏకైక విమానయాన సంస్థగా కూడా ఇండిగో గుర్తింపు తెచ్చుకుంది.

    ఇక ఇండో ఫ్లైట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అషిమ్ మిత్రా మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లవేళలా వైవిధ్యం కోరుకుంటుందని పేర్కొన్నారు. 2024 మార్చి 31 నాటికి ఇండిగోలో 36, 860 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ ఇదివరకే ప్రకటించింది. ఇందులో 5038 మంది పైలెట్లు కాగా, 9363 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా 77 మంది మహిళా పైలెట్లకు అవకాశం కల్పించడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.

    దీనిపై కొందరు మహిళా పైలెట్లు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. భరతమాతకు సేవలందించేందుకు తమకో చక్కని అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. ఇక పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఇండిగో మంచి నిర్ణయం తీసుకుందని, దేశ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఇండిగో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.

    ఇక బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థగా ఇండిగోకు పేరుంది. గుర్గావ్ కేంద్ర దీని సేవలు అందిస్తున్నది. ఈ ఏడాది ఆఖరికల్లా దేశంలో 36.1శాతం వాటా కలిగిన అతి పెద్ద విమానయానసంస్థగా ఈ సంస్థ ఎదగబోతున్నది. ప్రస్తుతం దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు ఇతర దేశాల్లోని 37 కేంద్రాల ద్వారా ఇండిగోతన సేవలను అందిస్తున్నది. నిత్యం 550 విమానాలను నడుపుతున్నది.

    ఇండిగో సంస్థ అంతర్జాతీయ సేవలు ప్రారంభించి ఈ ఏడాదికి 13 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఇండిగో వద్ద ఎయిర్ బస్ ఏ320 రకానికి చెందిన విమానాలు మాత్రమే ఉన్నాయి. సుమారు 100 విమానాలు ఇవే కావడం గమనార్హం. తన సేవల ద్వారా గతంలో ఇండిగో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో పాటు ప్రయాణికుల అభిమానాన్ని కూడా చూరగొన్నది.