Dil Raju: దిల్ రాజు మాస్టర్ ప్లాన్ కి చిరంజీవి-బాలయ్య విలవిలలాడుతున్నారు. తమని కాదని డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిన మైత్రీ మూవీ మేకర్స్ కి ఊహించని షాక్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాడట. సంక్రాంతికి వీరసింహారెడ్డి-వాల్తేరు వీరయ్య చిత్రాలను దిల్ రాజు భారీగా దెబ్బతీయనున్నాడనేది టాలీవుడ్ టాక్. దానికి ఆయన ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి రెడీ చేసి పెట్టాడట. దిల్ రాజు వ్యూహంలో చిక్కుకొని మైత్రీ మూవీ మేకర్స్ అల్లాడి పోవడం ఖాయం అంటున్నారు.

పరిశ్రమపై దిల్ రాజు ఆధిపత్యాన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారు. హేమాహేమీలను కాదని ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన దిల్ రాజు గుప్పెట్లోకి పరిశ్రమ వెళ్లడం ఊహించని పరిమాణం. సినిమా బిజినెస్ కి సంబంధించిన కీలక ఏరియా దిల్ రాజు ఆధీనంలో ఉంది. అందుకే అతడు ఆడిందే ఆట అవుతుంది. దిల్ రాజును కట్టడి చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ వారసుడు చిత్రం సంక్రాంతికి విడుదల కాకుండా చేయాలని చూశారు. వారి కంటే ఓ మెట్టు పైనున్న దిల్ రాజు వాళ్ళ పాచిక పారకుండా చేశాడు. తమిళ దర్శక నిర్మాతల చేత వారసుడు సినిమాను ఆపితే పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్పించాడు.
వారసుడు చిత్ర విడుదల ఆపితే తమిళనాడులో తెలుగు చిత్రాలు ఇబ్బందిపడతాయి. దీంతో వెనక్కి తగ్గి వారసుడు కి దారి వదిలా రు . టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థగా అవతరించిన మైత్రీ మూవీ మేకర్స్ … దిల్ రాజు చర్యలకు విసిగిపోయారు. మనం కోట్లు పెట్టి సినిమా తీసి దిల్ రాజు చేతిలో పెట్టడం ఏమిటని భావించి, కొత్తగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. వారు నిర్మించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను సొంతగా రిలీజ్ చేసుకుంటున్నారు.
మన స్థానం నిలబడాలంటే పోటీ లేకుండా చేసుకోవాలి. ఎదిగాలని చూసే వాళ్ళని తొక్కేయాలి. మైత్రీ మూవీ మేకర్స్ మొదటి అడుగునే చిదిమేయాలి. మళ్ళీ ఇటువైపు రావాలంటే భయపడేలా చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యాడు. ఈ సంక్రాంతి చిత్రాల థియేటర్స్ పంపకంలో తన ప్రణాళికలు అమలు చేయనున్నాడు. సిండికేట్ గా మారిన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకు కింగ్ గా ఉన్న దిల్ రాజు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. వందకు పైగా సెంటర్స్ లో వారసుడు చిత్రానికి థియేటర్స్ కేటాయించారు.

సింగిల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్స్ మాత్రమే ఉన్న సెంటర్స్ లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు దెబ్బపడనుంది. సింగిల్ స్క్రీన్ ఉన్న సెంటర్లో వారసుడు ఆడుతుంది. డబుల్ స్క్రీన్ సెంటర్స్ లో వారసుడితో పాటు బాలయ్య లేదా చిరంజీవి సినిమాకు అవకాశం దొరుకుతుంది. ఒకవేళ వారసుడు ప్లాప్ టాక్ తెచ్చుకొని థియేటర్స్ కోల్పోయే పరిస్థితి వస్తే… జనవరి 14న విడుదలవుతున్న కళ్యాణం కమనీయం చిత్రంతో వారసుడు థియేటర్స్ రీప్లేస్ చేస్తారు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా చిరు, బాలయ్య చిత్రాలకు అదనంగా థియేటర్స్ దొరకవు. కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ కోల్పోవాల్సి వస్తుంది.