Man Caught Leopard: బైక్‌పై వస్తున్న దంపతులపై కర్ణాటకలో చిరుత దాడి చేసింది. భార్య, పిల్లలను కాపాడుకోవడానికి భర్త చిరుతతో తీవ్రంగా పోరాడాడు. చివరకు చిరుతను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. తాజాగా ఇలాంటి ఘటనే మళ్లీ కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. చిరుతను ఓడించి దానిని బైక్‌కు కట్టేసుకుని తీసుకెళ్లి అటవీశాఖ అధికారులకు అప్పగించాడో రైతు.
సాధారణంగా చిరుతపులి గాండ్రింపు వినగానే ఎక్కడికో పారిపోతాం. కనిపించగానే భయంతో సగం చచ్చిపోతాం. తప్పించుకునేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తాం. సినిమాల్లో అయితే హీరో చిరుతతో భీకర పోరాటం చేస్తాడు. ఆ పోరాట ఘట్టాన్ని మనం కళ్లప్పగించి మరీ చూస్తాం. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి మొన్నటి ట్రిపుల్ ఆర్ దాకా ఇలాగే చూసేశాం. కానీ నిజ జీవితంలో ఇలాంటివి జరిగితే అమ్మో అనుకుంటాం. కర్ణాటకలో ఓ యువ రైతు చిరుతతో భీకరంగా పోరాడాడు. అంతేనా దానిని తాళ్లతో బంధించి… తన బైక్ వెనకాల కట్టేసుకుని నేరుగా ఫారెస్ట్ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. ఈ ఘటన సోషల్ మీడియాను దున్నేస్తోంది.
జరిగిందంటే…
కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన దిన వేణుగోపాల్ అలియాస్ ముత్తు రోజూ మాదిరిగానే తన బైక్‌పై పొలానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఓ చిరుతపులి అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. వేగంగా వచ్చి దూకడంతో ముత్తు తన బైక్‌తోపాటు కిందపడిపోయాడు. కిందపడిపోయిన ముత్తుపై చిరుత పంజా విసిరింది. తప్పించుకునే మార్గంలేక ముత్తు ఎదురుదాడికి దిగాడు. వెనక్కి తగ్గినట్టే తగ్గిన చిరుత మరోసారి పంజా విసిరింది. ఈసారి మరింత బలంగా చిరుతను చిత్తు చేశాడు.
తాళ్లతో బంధించి.. బైక్‌కు కట్టుకుని..
వీరోచిత పోరాటంతో చిరుత చిత్తయింది. దీంతో రైతు ముత్తు
తన వద్ద ఉన్న తాళ్లతో చిరుత పులి నాలుగు కాళ్లను కట్టేశాడు. అంతటితో ఆగకుండా తన బైక్ వెనకాల గొర్రెను కట్టిన కట్టి నేరుగా అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లాడు. ముత్తు అలా వెళ్లడాన్ని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడది నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు ముత్తును ప్రశంసిస్తున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్‌కు ఏ మాత్రం తగ్గలేదని ట్వీట్ చేస్తున్నారు.
అటవీశాఖ అధికారుల షాక్..
చిరుత పులితో వచ్చిన ముత్తును చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకుని వెంటనే చిరుతపులిని ఆసుపత్రికి తరలించారు. ముత్తుకు ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవని… స్వీయ రక్షణలో భాగంగానే చిరుత పులిని కట్టేశాడని అటవీ అధికారులు తెలిపారు. అవగాహన రాహిత్యంతోనే అతను ఇలా చేశాడని… వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు మరోసారి ఇలాంటివి చేయకూడదని కౌన్సెలింగ్ ఇచ్చి ముత్తును వదిలేశామని తెలిపారు. ప్రస్తుతం చిరుత వైద్యుల పర్యవేక్షణలో ఉందని అటవీ అధికారులు తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: In karnataka a man caught a leopard tied its limbs and took it on a bike
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com