CI Anju Yadav : శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ తీరు మారడం లేదు. తప్పుచేశానని తెలిసినా.. ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు. ముప్పేట విమర్శలు ఎదురవుతున్నా ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. అన్నింటికీ మించి తాను ఒక మహిళా పోలీస్ అధికారినని మరిచిపోయి వ్యవహరిస్తున్నారు. చేసినది చాలదన్నట్టు వెకిలి నవ్వు, తొడకొడుతూ వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మరోసారి సంచలనంగా మారారు. జనసేనాని పవన్ తిరుపతిలో ఆమెపై ఫిర్యాదుచేస్తున్న ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె దూకుడును తెలియజేస్తున్నాయి.
మూడు రోజుల కిందట శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ఓ జనసేన నేతపై చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ పై వైసీపీ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన నేతలు నిరసన బాట పట్టారు. సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో కోపంతో రగిలిపోయిన సీఐ అంజూ యాదవ్ ఓ వైసీపీ నాయకుడి చెంపను చెల్లుమనిపించారు. ఈ హఠాత్ పరిణామంతో జనసేన నాయకులు ఆందోళనకు గురయ్యారు. సీఐ అంజూ యాదవ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో జనసేన శ్రేణులపై పోలీసులు కేసు నమోదుచేశారు.
జనసేన నాయకులపై సీఐ దాడి నేపథ్యంలో పవన్ స్పందించారు. మహిళా అధికారి అని తొలుత భావించినా.. ఆమె వైఖరి వివాదాస్పదంగా ఉండడం.. అధికార పార్టీకి మడుగులొత్తి సామాన్య ప్రజలను సైతం ఇబ్బందిపెడుతుండడంతో పవన్ స్పందించారు. ఆమెపై ఫిర్యాదు చేయడానికి నేరుగా తిరుపతి వచ్చారు. బాధితుడితో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో కవ్వింపునకు దిగినట్టు సీఐ అంజూ యాదవ్ గతంలో తనపై ఫిర్యాదుచేసిన వారి హోటల్ ఎదుటే తొడకొడుతూ, వెకిలి నవ్వులతో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది ముమ్మాటికీ పవన్ కు వ్యతిరేకంగా పెట్టిన వీడియోలేనని జన సైనికులు ఆరోపిస్తున్నారు.
అయితే సీఐ అంజూ యాదవ్ తెగింపునకు అధికార వైసీపీ నేతలే కారణం. ఆమె తీరు వివాదాస్పదంగా ఉండడంతో పోలీస్ ఉన్నతాధికారులు సైతం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. విపక్ష నేతలపై దూకుడు కనబరుస్తుండడంతో ఆమెను అధికార పార్టీ నేతలు వెనుకేసుకొస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎస్పీ డీజీపీకి నివేదిక ఇచ్చారు. నోటీసులు అందించేందుకు సిద్ధపడ్డారు. కానీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనరెడ్డితో పాటు కొందరు పెద్దలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె మరింత దూకుడు కనబరుస్తున్నారు. అందుకే ఆమె ఏకంగా కవ్వింపునకు దిగినట్టు తొడకొడుతున్నారు. వెకిలి నవ్వు నవ్వుతూ ఎగతాళి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు తొడగొట్టి రారా ప్యాకేజి గా అంటూ సవాల్ విసిరిన సీఐ pic.twitter.com/8zN75dKAeC
— Anitha Reddy (@Anithareddyatp) July 17, 2023