
ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపు ఊపేసిన పొడుగుకాళ్ల సుందరి ‘ఇలియానా’ ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా పెద్దగా హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. దాదాపు అర్ధ దశాబ్ధానికి పైగా టాలీవుడ్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ హఠాత్తూగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి నిష్క్రమించింది.ప్రస్తుతానికి ఇలియానాకు అటు తెలుగులోనూ.. ఇటు హిందీలోనూ అవకాశాలు లేవు.
ఇలియానా ఈ మధ్యే ఒక బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పి మాల్దీవులు, గోవా, ముంబై సముద్ర తీర ప్రాంతాల్లో హాట్ హాట్ ఫొజులతో కాకరేపుతోంది. తాజాగా తన బికినీ ఫొటోను ఇలియానా షేర్ చేసింది. ఇది కుర్రాళ్లకు చమటలు పట్టించేలా ఉంది.
34 ఏళ్ల ఈ బ్యూటీ పసుపు రంగ బికినీ ధరించి ఈ ఫొటోలో కనిపిస్తోంది. జెడ ముందు వేసుకొని మధ్యలో ఒక చైన్ హారంలా ధరించి ఇలియాన ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. లాకెట్ సెల్ఫీని మరింత ఆకర్షనీయంగా మలిచింది. ‘టాన్-ఇది నీటి అంచుల వద్ద తీసిన ఫొటో’ అని రాసుకొచ్చింది.
ఇక ఇలియానా సినిమాల విషయానికి వస్తే ‘ది బిగ్ బుల్’ చిత్రంలో ఇలియినా నటించింది. ప్రస్తుతం ఆమె ‘లవ్లీ’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.