https://oktelugu.com/

ప్చ్.. రజనీ రాజకీయ దుకాణం బంద్ !

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ వ్యవహారం మొత్తానికి ఒక క్లారిటీకి వచ్చింది. తన రాజకీయ దుకాణానికి రజిని బంద్ చెప్పారు. ఇక తానూ భవిష్యత్తులో కూడా ఎలాంటి రాజకీయ ఆలోచనలు చెయ్యను అని తాజాగా ఈ రోజు రజిని ప్రకటించి.. మొత్తమ్మీద మళ్ళీ ఫ్యాన్స్ ను బాగా నిరాశకి గురిచేశారు. నెల రోజులు పాటు అమెరికాలో ఉండి హెల్త్ చెకప్ చేయించుకొని మరీ వస్తే.. రాజకీయ రణరంగానికి సిద్ధం అయి వచ్చాడు అనుకున్నారు ఫ్యాన్స్. కానీ, […]

Written By: , Updated On : July 12, 2021 / 03:04 PM IST
Follow us on

Rajinikanth Politicsసూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ వ్యవహారం మొత్తానికి ఒక క్లారిటీకి వచ్చింది. తన రాజకీయ దుకాణానికి రజిని బంద్ చెప్పారు. ఇక తానూ భవిష్యత్తులో కూడా ఎలాంటి రాజకీయ ఆలోచనలు చెయ్యను అని తాజాగా ఈ రోజు రజిని ప్రకటించి.. మొత్తమ్మీద మళ్ళీ ఫ్యాన్స్ ను బాగా నిరాశకి గురిచేశారు. నెల రోజులు పాటు అమెరికాలో ఉండి హెల్త్ చెకప్ చేయించుకొని మరీ వస్తే.. రాజకీయ రణరంగానికి సిద్ధం అయి వచ్చాడు అనుకున్నారు ఫ్యాన్స్.

కానీ, తన గోల తనదే అన్నట్టు మీటింగ్ ఏర్పాటు చేసి మరీ, రజిని చివరకు ఇలా తుస్సు మనిపించారు. అయినా ఇలాంటి న్యూస్ చెప్పడానికి ప్రత్యేకంగా అభిమాన సంఘాలను పిలవడం ఎందుకో ?. ఏది ఏమైనా తన ఆరోగ్య కారణాల వల్లే తాను ఇక ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను అని రజనీ నీరసపు స్పీచ్ ఇచ్చాడు. దాంతో, రజిని నిర్ణయం పై ఆయన అభిమానులు మాత్రం ఆగ్రహంగా ఉన్నారు.

దాదాపు పాతికేళ్ల పాటు ‘పార్టీ పెడతాను’ అంటూ వార్తలను లీక్ చేసి.. తమిళనాట తానే మరో రాజకీయ సంచలన అన్న మాదిరిగా ఆశలు పుట్టించి, రజిని ఇలా ఇన్నింగ్స్ మొదలుపెట్టకుండానే డిక్లేర్ చేయడం ఏమి బాగాలేదు అంటూ రజినీకాంత్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ‘తమిళనాట రజిని మాటే శాసనం’ అని ఇన్నాళ్లు ఫ్యాన్స్ కూడా బాగా హడావిడి చేశారు.

కానీ రజనీ మాత్రం ఆ ఒక్క మాట అనడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. నిజానికి ఒకప్పుడు రజనీ రాజకీయాల్లోకి వస్తే.. కచ్చితంగా ప్రభుత్వాలను కూల్చగలడు అని ప్రత్యర్థి పార్టీలు కూడా భయపడ్డాయి. అంతటి క్రేజ్ ఉన్న రజనీ, తన ఇమేజ్ ను తానే కరెక్ట్ గా ఉపయోగించుకోలేక పోయాడు. ముఖ్యంగా గత మూడు, నాలుగేళ్లుగా చేస్తోన్న స్వీయ రాజకీయ తప్పిదాలు కూడా రజిని ప్రాభవాన్ని తగ్గిస్తున్నాయి.