Actor Ali Son In Law: కమెడియన్ అలీ అల్లుడి బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Actor Ali Son In Law: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దశాబ్దాలుగా కొనసాగుతూ బాలనటుడిగా, కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టు గా గొప్పగా రాణించిన అలీ, ఇటీవలే తన పెద్ద కుమార్తె ఫాతిమాకు హైదరాబాద్ లోని ఓ కన్వెంన్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు..ఈ వివాహ మహోత్సవానికి చిరంజీవి, నాగార్జున వంటి సినీ సెలెబ్రిటీలు హాజరు కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు కూడా […]

Written By: Neelambaram, Updated On : November 30, 2022 3:16 pm
Follow us on

Actor Ali Son In Law: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దశాబ్దాలుగా కొనసాగుతూ బాలనటుడిగా, కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టు గా గొప్పగా రాణించిన అలీ, ఇటీవలే తన పెద్ద కుమార్తె ఫాతిమాకు హైదరాబాద్ లోని ఓ కన్వెంన్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు..ఈ వివాహ మహోత్సవానికి చిరంజీవి, నాగార్జున వంటి సినీ సెలెబ్రిటీలు హాజరు కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యాడు..ఇటీవల ఫాతిమా తన ఎంబీబీఎస్ చదువుని పూర్తి చేసుకోగా..నా కుటుంబంలో ఒక డాక్టరు ఉంది అంటూ అలీ ఎంతగానో మురిసిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.

Actor Ali Son In Law

మరో విశేషం ఏమిటంటే.. అల్లుడు షహాయాజ్ కూడా డాక్టర్ అట.. వీళ్లిద్దరు ఒకే యూనివర్సిటీ లో ప్రేమించుకున్నారా.. లేదా అలీ ఈ డాక్టర్ సంబంధంని వెతికి మరీ అతనికి ఇచ్చి పెళ్లి చేశాడా అనేది తెలియాల్సి ఉంది..అంతే కాకుండా అలీ అల్లుడు షహాయాజ్ ఎవరు? ఏం చేస్తుంటారన్న దానిపై అందరూ ఆరాతీస్తున్నారు. ఇతడి బ్యాక్ గ్రౌండ్ గురించి సోషల్ మీడియాలో ఆరాతీస్తున్నారు. అలీ అల్లుడిపై ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందు ఉంచుతున్నాం.

షహాయాజ్.. ‘జమిలా బాబీ మరియు జలాని భాయ్’ దంపతుల ముద్దుల కొడుకు..ఇతనికి ఒక అన్నయ్య మరియు సోదరి ఉన్నారు.. స్వతహాగా షహాయాజ్ కుటుంబం మంచి ఆస్తి పరులే.. వీళ్ళకి కేవలం హైదరాబాద్ లోనే 200 కోట్ల రూపాయిల విలువగల ఆస్తులు ఉన్నాయట.. అతని కుటుంబంలో ఉన్న వారందరు మంచి విద్య వంతులే..వృత్తి రీత్యా వీరి నెల జీతం లక్షల్లోనే ఉంటుంది..కట్నం కూడా అలీ పెద్ద మొత్తం లోనే ఇచ్చినట్టు తెలుస్తోంది.. కూతురు అల్లుడు పేరిట నగదుతో పాటుగా ఒక అందమైన ఇల్లుని కూడా బహుమతిగా ఇచ్చాడట.

Actor Ali Son In Law

ఇక అలీ సినిమాల విషయానికి వస్తే.. ఇంతకు ముందుతో పోలిస్తే అలీకి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గాయి అనిపిస్తుంది.. సొంతంగా ఒక నిర్మాణ సంస్థని ప్రారంభించి ఆయన హీరో గా ఇటీవలే ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే సినిమా చేసాడు.. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి పర్వాలేదు అనే రేంజ్ లోనే రెస్పాన్స్ వచ్చింది.

Tags