
Vishwak Sen – Samantha : జనాలను థియేటర్స్ కి రప్పించేందుకు అనేక మార్గాలున్నాయి. ట్రైలర్స్, టీజర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, పెద్ద హీరోల సపోర్ట్, సోషల్ మీడియా ప్రమోషన్స్ దానిలో భాగమే. వీటితో పాటు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, సింపతీ కార్డు కూడా ఉంటాయి. రంగమార్తాండ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో అనసూయ కన్నీరు పెట్టుకున్నారు. నిజానికి అనసూయ సెన్సిటివ్ కాదు. మాటకు మాట ఎదురు చెప్పే టైప్. కారణం ఏదైనా ఆమె కన్నీరు పెట్టుకున్నారంటే నమ్మడం కష్టం. సమంత సైతం పబ్లిక్ లో ఏడ్చింది.
మయోసైటిస్ నుండి కోలుకున్న సమంత మొదటిసారి శాకుంతలం మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆమె తెల్లని వస్త్రాలు ధరించి, చేతిలో జపమాలతో కనిపించారు. గుణశేఖర్ ఆమె గురించి మాట్లాడుతుంటే కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఓపిక లేకపోయినా కేవలం గుణశేఖర్ కోసం ఈ ప్రెస్ మీట్ కి వచ్చినట్లు భావోద్వేగానికి గురయ్యారు. ఇదంతా సింపతీ కోసం చేస్తున్న నాటకం అన్నమాట వినిపించింది. శాకుంతలం మూవీకి ప్రచారం కల్పించడానికి, జాలితో ప్రేక్షకులు సినిమా చూసేలా చేయాలని ఆమె తపనంటూ కొందరు విమర్శించారు.
యశోద చిత్రం విడుదల సమయంలో కూడా ఆమె ఇదే ట్రిక్ ప్లే చేశారు. మయోసైటిస్ అంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజానికి మయోసైటిస్ అంత ప్రాణాంతకం ఏమీ కాదు. కేవలం సింపతీ క్రియేట్ చేసి లబ్ది పొందే ప్రయత్నం అంటూ ఓ సీనియర్ నిర్మాత నేరుగానే విమర్శలు చేశారు. చూస్తుంటే ఇదే ట్రిక్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫాలో అవుతున్నట్లుగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే పదం… ఈ సినిమాకు మొత్తం పెట్టేశాను, అని. అంటే దాస్ కా ధమ్కీ మూవీ పోతే నేను రోడ్డున పడతాను, సినిమా చూసి ఆదరించండి అన్నట్లు అతని తీరుంది. సమంత గురించి అడిగినప్పుడు కూడా విశ్వక్ కళ్లు తుడుచుకుటూ ఎమోషనల్ అయ్యాడు. ఇదంతా కూడా సింపతి గేమ్ అన్న విమర్శలు రాకమానవు.
ప్రీ రిలీజ్ వేడుకలో గెస్ట్ ఎన్టీఆర్ చేత కూడా ఈ మాట చెప్పించాడు. ‘అన్నా ఈ సినిమాకు ఉన్నదంతా పెట్టేశాను అని విశ్వక్ నాతో చెప్పాడు’ అని ఎన్టీఆర్ అన్నారు. దాస్ కా ధమ్కీ మూవీ డబ్బుల కోసం తీయలేదు అంటూనే ఉన్నదంతా ఈ సినిమాకు ఖర్చు చేశానని అంటున్నాడు. విశ్వక్ తెలుసుకోవాల్సింది ఏదంటే… నువ్వు ఉన్నదంతా పెట్టి తీసినా, అప్పులు చేసి తీసినా సినిమా బాగుంటేనే చూస్తారు. నచ్చితేనే ఆడుతుంది. సింపతీ కార్డు చాలా రేర్ గా వర్క్ అవుట్ అవుతుంది. అబ్బాయిలకు అసలు కాదు. కాబట్టి సినిమా వచ్చేసింది, జనాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో ఎదురుచూడటమే…