ట్రెండింగ్ న్యూస్Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో లోపల చూస్తే మైండ్ బ్లోయింగ్.. ఎన్ని ఏర్పాట్లో తెలుసా?

Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో లోపల చూస్తే మైండ్ బ్లోయింగ్.. ఎన్ని ఏర్పాట్లో తెలుసా?

Telangana Secretariat : 23 ఎకరాల ప్రాంగణం.. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం.. ఆరు అంతస్తుల భవనం.. ఇదీ స్థూలంగా తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణశైలి. ప్రభుత్వం ఏకంగా 12 వందల కోట్లు ఖర్చు చేసి ఈ సచివాలయం నిర్మించింది.. ఈరోజు అట్టహాసంగా ప్రారంభించబోతోంది. బయటికి కనిపించవి మాత్రమే కాదు కనిపించని ఎన్నో విషయాలు ఈ సచివాలయం నిర్మాణంలో దాగి ఉన్నాయి.

అద్భుతమైన ఫర్నిచర్
సచివాలయంలో అద్భుతమైన,  సౌకర్యవంతమైన ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. మొత్తం 22 వేల ఫర్నిచర్ వస్తువులు అందుబాటులో ఉంచారు. వీటిల్లో టేబుళ్ళు, కుర్చీలు, సోఫాలు, కప్ బోర్డులు, టీ పాయ్ లు ఉన్నాయి. వివిధ సెక్షన్లు, కాన్ఫరెన్స్ హాళ్ళు, మంత్రులు, సీఎం ఛాంబర్, వారి సిబ్బంది కార్యాలయాలు, సీఎస్ కార్యాలయం, ఉన్నతాధికారుల పేషీలకు కలిపి మొత్తం 1880 టేబుళ్ళు, 4,886 కుర్చీలు ఏర్పాటు చేశారు. మంత్రులకు 23 ఛాంబర్లు కేటాయించారు. 26 కాన్ఫరెన్స్ రూములు ఏర్పాటు చేశారు. మరో నాలుగు కాన్ఫరెన్స్ రూమ్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. సచివాలయంలోని ప్రతి ఫ్లోర్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా డైనింగ్ ఏరియా ఏర్పాటు చేశారు.
విభాగాల వారీగా
మంత్రులు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సీఎస్ కు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించారు. 1,190 సెక్షన్ ఆఫీసర్లకు, 106 మంది అసిస్టెంట్ సెక్రటరీలు, 59 మంది డిప్యూటీ సెక్రటరీలకు, 29 మంది అదనపు/ జాయింట్ సెక్రటరీలకు, 58 మంది సెక్రటరీ ఆ పై స్థాయి అధికారులకు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించి దాని ఆధారంగా ఎన్ని సీట్లు, ఎంతమంది విజిటర్ సీట్లు, సోఫాలు ఎన్ని, టీవీలు, ఎల్ఈడి స్క్రీన్లు ఎన్ని అనేది పక్కాగా లెక్కలు వేసి మరీ ఏర్పాటు చేశారు. ప్లగ్ అండ్ ప్లే విధానాల్లో పనిచేసేలా కార్యాలయాలను సిద్ధం చేశారు. అధికారులకు అన్ని వసతులను సమకూర్చారు. స్కై లాంజ్ పేరుతో ప్రత్యేక లాంజ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ లాంజ్ లో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, విదేశీ ప్రతినిధుల కోసం ప్రత్యేక సమావేశ మందిరాన్ని సిద్ధం చేశారు. సచివాలయంలో అడుగడుగునా ఆధునిక సాంకేతికతను మేళవించారు. అనితర సాధ్యమైన సౌకర్యాలు కల్పించారు. ఫర్నిచర్ దగ్గర నుంచి పూల కుండీల వరకు.. టెక్నాలజీ మొదలుకొని టాయిలెట్ ల వరకు అంతటా ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించారు.

YouTube video player

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Congress Vs BRS: ఆ ఇద్దరి మంత్రుల ఘాటు ప్రేమలకు అడ్డే లేదు.. మీడియాలో పడి లొల్లి లొల్లి!

Congress Vs BRS: 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అలాగని జనాలు వన్ సైడ్ విక్టరీని కాంగ్రెస్ పార్టీకి అందించలేదు. గులాబీ పార్టీ బలమైన ప్రతిపక్షంగా...

Telangana State 5 Lakh Crore GO Leak: 5 లక్షల కోట్ల జీవో లీక్: తెలంగాణ ప్రభుత్వ రహస్యాలు బయటపెడుతున్న ఆ దొంగ ఎవరు?

Telangana State 5 Lakh Crore GO Leak: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వు (GO) ముసాయిదా (Draft) దశలోనే లీక్ కావడంపై...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...

Harish Rao: బామ్మర్ది కేటీఆర్ ను సైడ్ చేసిన హరీష్.. ఏదో జరుగుతోంది

Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...

Armoor MLA: తులం బంగారం పంచాయితీ.. కాంగ్రెస్ నేతల మెడలోని బంగారం గోవిందా.. సంచలన పిలుపు

Armoor MLA: తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుంచి రాకేష్ రెడ్డి...

Ration Card: రేషన్ కార్డ్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Ration Card: దేశంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని రేషన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్...
Exit mobile version