https://oktelugu.com/

Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో లోపల చూస్తే మైండ్ బ్లోయింగ్.. ఎన్ని ఏర్పాట్లో తెలుసా?

మంత్రులు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సీఎస్ కు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించారు.

Written By:
  • Rocky
  • , Updated On : April 30, 2023 / 11:11 AM IST
    Follow us on

    Telangana Secretariat : 23 ఎకరాల ప్రాంగణం.. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం.. ఆరు అంతస్తుల భవనం.. ఇదీ స్థూలంగా తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణశైలి. ప్రభుత్వం ఏకంగా 12 వందల కోట్లు ఖర్చు చేసి ఈ సచివాలయం నిర్మించింది.. ఈరోజు అట్టహాసంగా ప్రారంభించబోతోంది. బయటికి కనిపించవి మాత్రమే కాదు కనిపించని ఎన్నో విషయాలు ఈ సచివాలయం నిర్మాణంలో దాగి ఉన్నాయి.

    అద్భుతమైన ఫర్నిచర్
    సచివాలయంలో అద్భుతమైన,  సౌకర్యవంతమైన ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. మొత్తం 22 వేల ఫర్నిచర్ వస్తువులు అందుబాటులో ఉంచారు. వీటిల్లో టేబుళ్ళు, కుర్చీలు, సోఫాలు, కప్ బోర్డులు, టీ పాయ్ లు ఉన్నాయి. వివిధ సెక్షన్లు, కాన్ఫరెన్స్ హాళ్ళు, మంత్రులు, సీఎం ఛాంబర్, వారి సిబ్బంది కార్యాలయాలు, సీఎస్ కార్యాలయం, ఉన్నతాధికారుల పేషీలకు కలిపి మొత్తం 1880 టేబుళ్ళు, 4,886 కుర్చీలు ఏర్పాటు చేశారు. మంత్రులకు 23 ఛాంబర్లు కేటాయించారు. 26 కాన్ఫరెన్స్ రూములు ఏర్పాటు చేశారు. మరో నాలుగు కాన్ఫరెన్స్ రూమ్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. సచివాలయంలోని ప్రతి ఫ్లోర్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా డైనింగ్ ఏరియా ఏర్పాటు చేశారు.
    విభాగాల వారీగా
    మంత్రులు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సీఎస్ కు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించారు. 1,190 సెక్షన్ ఆఫీసర్లకు, 106 మంది అసిస్టెంట్ సెక్రటరీలు, 59 మంది డిప్యూటీ సెక్రటరీలకు, 29 మంది అదనపు/ జాయింట్ సెక్రటరీలకు, 58 మంది సెక్రటరీ ఆ పై స్థాయి అధికారులకు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించి దాని ఆధారంగా ఎన్ని సీట్లు, ఎంతమంది విజిటర్ సీట్లు, సోఫాలు ఎన్ని, టీవీలు, ఎల్ఈడి స్క్రీన్లు ఎన్ని అనేది పక్కాగా లెక్కలు వేసి మరీ ఏర్పాటు చేశారు. ప్లగ్ అండ్ ప్లే విధానాల్లో పనిచేసేలా కార్యాలయాలను సిద్ధం చేశారు. అధికారులకు అన్ని వసతులను సమకూర్చారు. స్కై లాంజ్ పేరుతో ప్రత్యేక లాంజ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ లాంజ్ లో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, విదేశీ ప్రతినిధుల కోసం ప్రత్యేక సమావేశ మందిరాన్ని సిద్ధం చేశారు. సచివాలయంలో అడుగడుగునా ఆధునిక సాంకేతికతను మేళవించారు. అనితర సాధ్యమైన సౌకర్యాలు కల్పించారు. ఫర్నిచర్ దగ్గర నుంచి పూల కుండీల వరకు.. టెక్నాలజీ మొదలుకొని టాయిలెట్ ల వరకు అంతటా ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించారు.