
Wife’s affair : ఇటీవలి కాలంలో వివాహేత సంబంధాలు పెరిగిపోతున్నాయి. భర్త/ ఉన్నప్పటికీ పరాయి వ్యామోహం పెరిగిపోతోంది. పిల్లలు ఉన్నప్పటికీ మొగవాళ్లు ఒకటì రెండు సెటప్‌లు మోయింటేన్ చేస్తున్నారు. ఇక మహిళలు.. పరాయి మగాడితో శృంగారానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇక్కడ ఓ మహిళ విచిత్ర సంబంధానికి తెరలేపింది. మరో మహిళతో శృంగారం మొదలు పెట్టింది. భర్తకు తెలియకుండా ఆమెతో లేచిపోయింది.
భర్త, పిల్లలు ఉన్నా..
ప్రేమకి ఆడ, మగ అన్న తేడా ఉండదు. ఈ మధ్య ఆడవాళ్లు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లిళ్లు కూడా చేసేసుకుంటున్నారు. ఇటీవలో ఓ మహిళా క్రికెటర్ మరో మహిళ కారణంగా ప్రెగ్నెంట్ కూడా ఆందరినీ ఆశ్చర్యపర్చింది. తాజాగా ఇలాగే పెళ్లై భర్తను వదిలేసిన ఓ మహిళ మరో మహిళతో రిలేషన్ పెట్టుకుంది. పెళ్ళై పదేళ్లు అయ్యింది. భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, సదరు మహిళ భర్త సోదరితో ప్రేమలో పడింది. సీన్ కట్ చేస్తే ఆమెని పెళ్లి చేసుకుంది. ఈవిచిత్ర ఘటన బీహార్‌లో జరిగింది.
మరదలు సగం భర్త అని..
మరదలు అంటే సగం భర్త అని అంటారు. అంత మాత్రాన భర్తని వదిలేసి పెళ్లి చేసుకుంటారా? ఇదెక్కడైనా జరుగుతుందా? అంటే వీళ్లు చేసి చూపించారు. బీహార్‌కు చెందిన శుక్లాదేవి(32) తన భర్త ప్రమోద్ ని వదిలేసి మరదలి(భర్త సోదరి) సోని దేవిని(18) వివాహం చేసుకుంది. ప్రస్తుతం మరదలితోనే స్థిరపడింది. శుక్లాదేవికి పదేళ్ల క్రితమే ప్రమోద్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్ళైన ఆరు నెలల నుంచే శుక్లాదేవి తన మరదలితో వివాహేతర సంబంధం ప్రారంభించింది. అంటే అప్పుడు సోనీదేవి వయసు పదేళ్లలోపే. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి వేరే చోట మకాం పెట్టారు.
మరదలి కోసం మగాడిగా మారి..
తాజాగా మరదలు మేజర్ ఆవడంతో భర్తను వదిలేసి ఇద్దరూ వేరుకాపురం పెట్టారు. మరదలిపై రోజు రోజుకూ మోజు పెరగడంతో శుక్లాదేవి మగాడిగా మారిపోయింది. కట్టుబొట్టు పూర్తిగా మార్చేసింది. జడ కత్తిరించుకుని, మగాడిలా ప్యాంటు, షర్టు వేసుకుంటుంది. అంతేకాదు తన పేరుని సూరజ్‌కుమార్‌గా కూడా మార్చుకుంది. అయితే ఈ విషయం సోనీ దేవి కుటుంబ సభ్యులకు తెలియడంతో సోనీ దేవిని బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే తన భార్యను కిడ్నాప్ చేశారంటూ సూరజ్ కుమార్(శుక్లా దేవి) స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కొసమెరు.
విచిత్రంగా మహిళ తన భర్త సోదరితో స్థిరపడడం, అందుకోసం తాన మగాడిలా మారిపోవడం గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయాయరు. ఈ కేసును ఎలా సాల్వ్ చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.