
TTD Srivari devotees : తిరుపతిలో భక్తుల రద్దీ పెరుగుతోంది. భక్తుల రాక ఎక్కువవుతోంది. భక్తులు 18 కంపార్ట్ మెంట్లలో దర్శనానికి వేచి ఉంటున్నారు. శుక్రవారం 61 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 27 వేల మంది తలనీలాలు సమర్పించారు. టీటీడీ హుండీ ద్వారా రూ. 3.33 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. ఈనెల 27న ఉదయం 10 గంటలకు వసతి గదుల కోటా బుకింగ్ ను ప్రారంభించనున్నారు.
మార్చి నెలకు సంబంధించిన బుకింగ్ కోటా కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచిస్తోంది. పద్మావతి అతిథి గృహం, శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం, రామ్ బగీచా వరాహ స్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణ గిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. భక్తులు తమకు కావాల్సిన వసతులను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మార్చి నెలకు సంబంధించిన ప్రత్యే ప్రవేశ దర్శనం టికెట్లను శుక్రవారం విడుదల చేసింది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంచింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లు విడుదల చేసింది. ఆన్ లైన్ లక్కీడీప్ నమోదు ప్రక్రియ ఈనెల 22న ప్రారంభించింది.
లక్కీడీప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు డబ్బులు చెల్లించి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుది. వసతి గదులకు సంబంధించిన మార్చి నెలకు సంబంధించిన గదుల కేటాయింపు ఈనెల 27న విడుదల చేయనుంది. ఈ మేరకు భక్తులు గమనించుకుని టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ మేరకు భక్తులకు టీటీడీ అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని మంచిగా దేవుడిని దర్శనం చేసుకోవాలని సూచించింది. ఇలా టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని చెబుతోంది.