Wife Birthday: హలో ఎవ్రీవన్… మీకు మీ బర్త్ డే గుర్తుందా.. ఉండే ఉంటుంది లేండి. మన బర్త్‌డేను మనం మర్చిపోం. మీ అన్న చెల్లి, అక్క తమ్ముడి పుట్టిన రోజులు గుర్తున్నాయా.. ఉంటాయి. ఎందుకంటే.. వారు మన తోబుట్టువులు. ఇక ఫ్రెండ్స్.. బర్త్‌డే అంటే.. క్లోజ్ ఫ్రెండ్స్‌వి గుర్తుంటాయి. గార్ల్ ఫ్రెండ్ బర్త్‌డే గుర్తుంటుంది. మరి మీ వైఫ్ బర్త్‌డే గుర్తుందా… ఆలోచిస్తున్నారా.. అయ్యో మర్చిపోయారా… ఓరినాయనో… త్వరగా గుర్తుతెచ్చుకోండి. లేకుంటే ఆ దేశంలో ఉన్న చట్టం మన దేశంలో అమలు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అదేంటి పుట్టిన రోజు మర్చిపోతే జైలుకు పంపుతారా అనుకుంటున్నారా.. ఎస్ పంపుతారు. అయితే అది ఎక్కడంటే సమోవా ద్వీపంలో. అక్కడ భార్య బర్త్ డే మరిచిపోతే.. జైలు శిక్ష తప్పదు.
పుట్టిన రోజు ప్రత్యేకం..
ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు అనేది ప్రత్యేకమనైది. ఆ రోజున ఆ వ్యక్తికి మంచి ఫీల్ కలిగించాలి. అయితే మరిచిపోతే మాత్రం.. సమోవా ద్వీపంలో చట్టరీత్యా నేరం. జైలు శిక్ష వేస్తున్నారు. భార్య పుట్టిన రోజును మరిచిపోవడం కూడా నేరమే అన్నమాట. ఇది వినడానికి విచిత్రంగానే ఉంది కదా. కానీ నిజంగానే అమలు చేస్తున్నారు. ఫసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలోని సమోవా ద్వీపంలో ఇలాంటి రూల్ ఉంది. అక్కడకు వెళ్లి ఉండాలి అనుకుంటే.. ఏం కాదు. కానీ భార్య పుట్టిన రోజును మరిచిపోతే మాత్రం.. తప్పకుడా అది నేరం కింద లెక్క.
కారణం లేకుండానే శిక్ష..
ఇక్కడి రూల్ ప్రకారం.. అనుకుని మరిచిపోయాడా.. లేదంటే.. అనుకోకుండా మరిచిపోయాడా అనేది చూడరు. మరిచిపోయాడు అంతే.. దీనితో న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. ఈ విషయాన్ని భార్య వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చాలు. ఇబ్బందుల ఎదుర్కోవాల్సి వస్తుంది. భర్తను తీసుకెళ్లి జైలులోకి పంపిస్తారు. అందుకే.. భర్త జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అయితే ఈ చట్టంలో కాస్త వెసులుబాటు ఉంది. మెుదటిసారి భార్య పుట్టినరోజును మరిచిపోతే.. కాస్త చూసీచూడనట్టుగా వ్యవహరిస్తారు. మరోసారి అలా చేయోద్దని.. పోలీసులు హెచ్చరిస్తారు. మళ్లీ అదే రిపీట్ చేశారనుకో.. తప్పు అవుతుంది. జైలు రూపంలో శిక్ష పడుతుంది.
మన దేశంలో ఇలాంటి చట్టాలు అమలులో ఉంటే.. చాలా మంది భర్తలు జైలుకే వెళ్తారేమో. ఇలాంటి వెరైటీ చట్టాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఉత్తర కొరియాలో నీలిరంగు జీన్స్‌తో ఇంటి నుంచి బయటకు వెళ్లడం చట్టవిరుద్ధం.