Atma Sakshi Survey : జనసేన సీట్లపై ఆత్మసాక్షి సర్వే అంచనా ఎందుకు హేతుబద్దంగా లేదు?

టిడిపి, జనసేనతో వామపక్షాలు కలిస్తే కూటమికి 115 నుంచి 122 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి 56 నుంచి 58 మధ్య సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సర్వే తేల్చింది.

Written By: NARESH, Updated On : October 5, 2023 3:22 pm

Atma Sakshi Survey : ఆత్మసాక్షి సర్వే ఏపీ ఎన్నికలపై ఓ రిపోర్ట్ విడుదల చేసింది. సర్వేలు సర్వేలే.. ఓపినియన్ పోల్స్ ఓపినియన్ పోల్సే.. ఎన్నికల ఫలితాలు ఎన్నికల ఫలితాలే.. మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ ఇండియా టుడే కూడా ఓ సర్వే చేసింది. అందులో మిక్స్ డ్ గా ఫలితాలు ఇచ్చింది. టైమ్స్ నౌ సర్వే అయితే 34-25 సీట్లు వైసీపీనే స్వీప్ చేస్తుందని వెల్లడించింది.

ఆత్మసాక్షి సర్వే సైంటిఫిక్ గా చేశామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సర్వే చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో గత నెల 12 నుంచి 30 వరకు ఆత్మసాక్షి ” మూడ్ ఆఫ్ ఏపీ” పేరిట నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. టిడిపి, జనసేన పొత్తుతో 50 శాతం ఓటింగ్ సాధిస్తాయని సర్వేలో తేలింది. అదే వామపక్షాలతో కలిసి ముందుకెళ్తే 54 శాతం ఓట్లు రావచ్చని స్పష్టమైంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ కూటమిలో కలిస్తే వైసీపీ పైచేయిగా నిలుస్తుందని తేలడం విశేషం. చంద్రబాబుపై సింపతి పెరగడంతో పాటు.. పవన్ బలం తోడు కావడంతో కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది.

మొత్తం నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ సర్వే చేసినట్లు సమాచారం. ఎవరికి వారు విడిగా పోటీ చేస్తే.. తెలుగుదేశం పార్టీకి 86, వైసీపీకి 68, జనసేనకు ఆరు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే టిడిపికి 95, జనసేనకు 13, వైసిపి 60 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. అదే తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తే ఆ కూటమి 75 స్థానాలకే పరిమితం కానున్నట్లు తేలింది. 100 సీట్లతో వైసిపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వే తేల్చింది. టిడిపి, జనసేనతో వామపక్షాలు కలిస్తే కూటమికి 115 నుంచి 122 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి 56 నుంచి 58 మధ్య సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సర్వే తేల్చింది.

ముఖ్యంగా జనసేన సీట్లపై ఆత్మసాక్షి సర్వే అంచనా ఎందుకు హేతుబద్దంగా లేదు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.