Maruthi Car: అత్యంత తక్కువ ధరలో ఈ మారుతి కారు.. అదేంటి.. విశేషాలు ఇవి

చిన్న ఫ్యామిలీ అయితేపెద్ద కారును తీసుకొని ప్రయోజనం ఉండదు. అయితే చిన్న కారు కొనాలనుకునేవారు మైలేజ్ తో పాటు లో బడ్జెట్ ఉండాలనుకుంటారు. ఈ క్రమంలో...

Written By: Chai Muchhata, Updated On : February 23, 2024 3:55 pm

Maruthi car

Follow us on

Maruthi Car:కారు కొనాలని ప్రతి ఒక్కిరికి ఉంటుంది. కానీ ఆఫీసు అవసరాలతో పాటు కుటుంబ సభ్యులు విహార యాత్రలు చేయడానికి సౌకర్యంగా ఉండే వాహనాలపై ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. అయితే చిన్న ఫ్యామిలీ అయితేపెద్ద కారును తీసుకొని ప్రయోజనం ఉండదు. అయితే చిన్న కారు కొనాలనుకునేవారు మైలేజ్ తో పాటు లో బడ్జెట్ ఉండాలనుకుంటారు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు రూ.5 లక్షల లోపు కార్లను అందిస్తున్నాయి. ఆ కారు వివరాల్లోకి వెళితే..

దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తోంది మారుతి సుజుకీ కంపెనీ. దీని నుంచి రిలీజ్ అయిన్న కార్లు అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాయి. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన ఆల్టో కే 10 పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ లో లభిస్తోంది. ఆల్టో కే 10 లీటర్ డ్యూయెల్ జెట్ ఇంజిన్ కలిగిన ఇందులో 67 బీహెచ్ పీ పవర్, 89 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ను కలిగిన ఈ కారు రూ.3.99 లక్షల నుంచి ప్రారంభ ధరను కలిగి ఉంది.

ఆల్టో కే 10 మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ఇది సీఎన్ జీ వేరియంట్ లో 57 బీహెచ్ పీ పవర్, 82 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందలుో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ మాత్రమే కలిగి ఉంది. చిన్న ఫ్యామిలీకి తక్కువ ధరలో కారు కొనాలనుకునే వారికి ఇది సౌకర్యంటా ఉంటుంది. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, డిజిటల్ ఇనిస్ట్రిమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్, మాన్యువల్ గా సర్దుబాటు చేయగల ఫీచర్లు ఉన్నాయి.