
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు సినిమాలతో సంబంధం ఉన్న ప్రతినోటా వినిపిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ వేదికగా పరిచయం చేసిన ఆయనను ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రశంసిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీకి చెందిన వారు సైతం రాజమౌళి చేసిన గొప్పతనంపై కీర్తిస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా రాజమౌళి బంధువులు సైతం ఆయన ఘనకీర్తిని మెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో రాజమౌళికి తనకు బంధుత్వం ఉందని, ఇద్దరం కలిసి ఒకే స్కూళ్లో చదువుకున్నామని ఓ మహిళ చెబుతుంది. తనకు రాజమౌళి అన్న వరుస అవుతారని అంటోంది. ఈ సందర్భంగా రాజమౌళి గురించి ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు రాజమౌళి స్వస్థలం. అయితే రాజమౌళి నాన్న విజయేంద్రప్రసాద్ గారు ఉద్యోగం నిమిత్తం కర్ణాటకకు వెళ్లారు. రాజమౌళి అక్కడే జన్మించారు. కానీ ఆయన విద్యాభ్యాసం అంతా ఏపీలోనే సాగింది. ఈ సందర్భంగా రాజమౌళితో తనకున్న అనుబంధం గురించి ఓ మహిళ చెబుతోంది. రాజమౌళి తల్లికి సంబంధించిన బంధువులమని చెబుతున్న ఆమె, రాజమౌళి ఒకే పాఠశాలలో చదువుకున్నారట.
‘రాజమౌళి మా చిన్నాన్న వాళ్ల కొడుకు.. నాకు అన్నఅవుతారు. మేం కలిసి దీప్తి స్కూళ్లో చదువుకున్నాం. రిక్షాలో పాఠశాలకు వెళ్లేవాళ్లం. రాజమౌళి తల్లి రాజనందిని గారితో నాకు ఎక్కువగా అనుబంధం ఉంది. కొవ్వూరుకు పిన్ని అప్పుడప్పుడు వచ్చేవారు. ఆ సమయంలో ఆమెతో ఎక్కువగా మాట్లాడేదాన్ని. ఒకసారి నన్ను పిలిచి హగ్ ఇచ్చారు. ఇప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోను. అయతే నేను పిన్నిని చాలా మిస్ అవుతున్నాను. అలాగే చిన్నాన్న విజయేంద్రప్రసాద్ కూడా నాతో బాగా మాట్లాడేవారు. ఇక కీరవాణి అన్న తో కూడా బాగా పరిచయం ఉంది. ఆయన తండ్రి శివశక్త దత్త అందిరికీ మూలం అయనే’ అని అన్నారు.

రాజమౌళికి చెల్లెలు సింగర్ శ్రీలేఖ అని, వీరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగింది. అయితే తాజాగా తాను కూడా వరుసకు చెల్లెలు అవుతానని ఓ మహిళ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే రాజమౌళి సొంతూరు కొవ్వూరు అయినందున ఆయన చుట్టాలు ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఇటీవల రాజమౌళి అత్యున్నత స్థాయికి ఎదిగిన నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు.