
NTR: ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే ప్రపంచ వేదికపై ఆస్కార్ అవార్డు అందుకొని వచ్చింది. ఈ సందర్భంగా ఈ మూవీ టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించిన విషయం తెలిసిందే. వీరిలో జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తి విషయాలు వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని, ఆ కష్టానికి ఫలితమే ఆస్కార్ అవార్డు అని జూనియర్ చెప్పుకొచ్చారు. ఇక ఆయన తల్లితో కలిసి సినిమా చూసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో చెప్పలేని అనుభూతి పొందినట్లు పేర్కొన్నారు.
నందమూరి కటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కు చిన్నప్పటి నుంచి కళలంటే అమితాసక్తి. ఆ ఇష్టమే తనను సినిమాల్లోకి తీసుకొచ్చిందని అంటారు. ముఖ్యగా మ్యూజిక్ తో ఎంజాయ్ చేస్తానన్నారు. తెలగులో రిలీజ్ అయిన ‘కేరాఫ్ కంచపాలెం’ సినిమా పాటలంటే తెగ ఇష్టమని చెబుతున్నారు. జీవితంలో పెద్దగా లక్ష్యాలు అంటూ లేవని చెప్పిన ఆయన ఒక్క సినిమాలో నటిస్తే చాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ అనుకోకుండానే ఇంత పెద్ద స్టార్ అయితానని అస్సలు ఊహించుకోలేదట.
ఎన్టీఆర్ తల్లి సినిమాల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా ను ఆయనతో కలిసి చూసినట్లు చెబుతున్నొరు. సినిమా థియేటర్లోకి వెళ్లిన తరువాత దూరంగా కూర్చున్న అమ్మ ఆయన సీన్ వచ్చే సరికి తన చేతిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను అని అంటున్నారు. తనకు ఇద్దరు కుమారులు అన్న విషయం తెలిసిందే. అయితే కూతురు లేదన్న బాధ ఎప్పటికీ ఉండేది. దీంతో కూతురు ఉన్న వాళ్లని చూస్తే ఈర్ష్య కలుగుతుందని ఎన్టీఆర్ చెబుతున్నారు.

‘నాటు నాటు’ కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదని ఎన్టీఆర్ అంటున్నారు. ఈ పాట కోసం ఇద్దరి శరీరాలు ఒకే విధంగా కనిపించేందుకు పలు వ్యాయామాలు చేశారట. దాదాపు 16 నెలల పాటు రోజూ 7 సార్లు భోజనం చేసిన తరువాత ఒకే లెవల్ కు వచ్చాక ఈ పాట చిత్రికరించారు. ఆ కష్టమే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని ఎన్టీఆర్ చెబుతున్నారు. జీవితంలో దేనికి తలవంచకుండా , ఎక్కడా చేతులు చాచకా.. అమ్మ చెప్పిన మాటల్ని ఉంచుకొని నడుచుకుంటానని ఎన్టీఆర్ చెబుతున్నారు.