spot_img
Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: నాకొద్దీ పెద్దరికం.. ఆ ఆశ నాకు లేదు.. చిరంజీవి సంచలన కామెంట్స్‌! 

Megastar Chiranjeevi: నాకొద్దీ పెద్దరికం.. ఆ ఆశ నాకు లేదు.. చిరంజీవి సంచలన కామెంట్స్‌! 

Megastar Chiranjeevi: చిరంజీవి.. పరిచయం అక్కరలేని పేరు. ఐదు దశాబ్దాలుగా సినిమాల్లో హీరోగా నలిస్తున్నారు. ఐదు పదుల వయసు దాటినా కుర్ర హీరోలతో పోటీపడి హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఆయన తీసిన వాల్తేరు వీరయ్య సంక్రాతికి విడుదల కానుంది. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో నిర్మించిన నూతన గృహ సముదాయాన్ని ఆయన గురువారం చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్స్‌ చేశారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో పెద్దరికం అనుభవించాలనే ఉద్దేశం నాకు లేదు. నాకు ఏ కుర్చీపై ఆశ లేదు.. కళాకారుల సంక్షేమం కోసం మాత్రం ఎప్పుడూ ముందుంటా’ అని తెలిపారు.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

 

 

బిజీ షెడ్యూల్‌లోనూ కార్మికుల కోసం వచ్చా..
‘‘సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలతో ఈరోజు నేను కాస్త బిజీగా ఉన్నాను. దాంతో ఈ కార్యక్రమానికి రాలేనని చెబుదామనుకున్నా. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున చిత్రపురి కాలనీకి శంకుస్థాపన జరిగిందని.. అందుకే ఇదే రోజున ఈ గృహ సముదాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని చైర్మన్‌ అనిల్‌ దొరై చెప్పారు. ఆయన చెప్పిన మాట విన్నాక ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నా. ప్రోగ్రామ్స్‌ అన్నీ వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చా. సినీ కార్మికులకు సైతం సొంత ఇల్లు ఉండాలనేది ఒక పెద్ద కల. ఆ కల సాకారం చేయడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ సందర్భంగా మనం డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డిని గుర్తు చేసుకుని ఆయనకు నివాళులు అర్పించాలి. ఆయన సుదీర్ఘ ఆలోచన నేడు సాకారమైంది’ అన్నారు.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

అవసరం వచ్చినప్పుడు భుజం కాస్తా..
ఈ గృహ సముదాయాన్ని నిర్మించడం కోసం కమిటీని ఏర్పాటు చేయగా మధ్యలో ఏవో అవకతవకలు జరిగాయన్నారని చిరంజీవి గుర్తుచేశారు. అయతే దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదని, దానిపై మాట్లాడనని తెలిపారు. అనిల్‌ దొరై సారథ్యంలోని కొత్త కమిటీ అన్ని పనులను సజావుగా పూర్తి చేసిందని సి.కల్యాణ్, తమ్మారెడ్డి తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు. కార్మికులకు ఏ అవసరం వచ్చినా తాను ముందు ఉంటానని చిరంజీవి తెలిపారు. సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ తనను ప్రతిసారీ పెద్ద అని చెబుతుంటారు. వాళ్లు నాకంటే చిన్నవాళ్లు అనిపించుకోవడం కోసం నన్ను పెద్ద అంటున్నారు అనడంతో సభలో నవ్వులు విరిశాయి. సినీ కార్మికులు, కళాకారులు తనకు కుటుంబసభ్యులతో సమానం అన్నారు. వాళ్లకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటాను. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానని వివరించారు. భగవంతుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు. దానిలో కొంతభాగాన్ని ఏదో ఒకరకంగా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నా అనని తెలిపారు. ‘పెద్దరికం అనుభవించాలనే ఆలోచన నాకు లేదు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజం కాస్తా’ అని మరోమారు స్పష్టం చేశారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version