Nagarjuna Akkineni: టాలీవుడ్ లో నాగార్జునకు ఒక బ్యాడ్ ఇమేజ్ ఉంది. ఆయన్ని సిల్వర్ స్క్రీన్ మన్మధుడు అంటారు. మహేష్ కంటే ముందు అందగాడు ట్యాగ్ నాగార్జునదే. అయితే ఆయన ఆఫ్ స్క్రీన్లో కూడా మన్మధుడే అంటారు. సుదీర్ఘ కెరీర్లో నాగార్జున చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపారట. బాలీవుడ్ బ్యూటీ టబుతో స్నేహానికి మించిన రిలేషన్ ఉందనే ఒక వాదన ఉంది. టబుతో ఎఫైర్ పై నాగార్జున మీడియా నుండి ప్రశ్నలు కూడా ఎదుర్కొన్నాడు. టబు నాకంటే నా వైఫ్ అమలకు బెస్ట్ ఫ్రెండ్. టబు హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చినా ఇంటికి వస్తుందని, నాగార్జున తెలిపారు.

నిజంగా నాగార్జునకు అమ్మాయిల వీక్నెస్ ఉందా…? ఈ ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున కంటెస్టెంట్స్ మధ్య ఒక టాస్క్ కండక్ట్ చేశారు. మూడు నెలలుగా బిగ్ బాస్ హౌస్లో ఉంటున్న వారి పరిశీలన ఎలా ఉంది. ఇంటిలో వస్తువులు , పరిసరాలపై వాళ్లకు అవగాహన ఉందా? లేదా? అని తెలుసుకోవాలి అనుకున్నారు. బిగ్ బాస్ హౌస్ గురించి ప్రశ్నలు అడుగుతాను. తెలిసినవారు గంట కొట్టి సమాధానం చెప్పాలి అన్నారు.
తప్పు ఆన్సర్ చెబితే మైనస్ మార్క్స్ అని చెప్పాడు. ఈ టాస్క్ స్టార్ట్ చేయబోయే ముందు నాగార్జున ఒక మాట చెప్పారు. ”నేను అమ్మాయిల పక్షపాతిని” అన్నారు. వెంటనే ”నేను అమ్మాయిల పక్షపాతి అని మాత్రమే చెప్పాను, బలహీనత ఉందని చెప్పలేదు” అని క్లారిటీ ఇచ్చాడు. అమ్మాయిల పక్షపాతి అనే స్టేట్మెంట్ తప్పుగా జనాల్లోకి వెళ్లొచ్చని నాగార్జున అమ్మాయిల పిచ్చి లేదని క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు.

కోట్ల మంది చూసే బిగ్ బాస్ వేదికపై నిలబడి నాగార్జున ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. అలాగే దశాబ్దాలుగా తనపై ఉన్న కొన్ని రూమర్స్ కి నాగార్జున సమాధానం చెప్పారు అనిపిస్తుంది. కాగా ఇనయా ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. ఇనయా ఎలిమినేషన్ అనంతరం హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన నాగార్జున, బుధవారం ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలియజేశాడు. నెక్స్ట్ సండే ఫినాలే జరగనుంది.