https://oktelugu.com/

Minister Roja: అవమానించిన హైపర్ ఆది, రాంప్రసాద్.. జబర్ధస్త్ స్టేజీ మీదనే ఏడ్చి వెళ్లిపోయిన రోజా

Minister Roja: ప్రతీ ఈవెంట్ కు ఓ ప్రోగ్రాంను నిర్వహించి ప్రేక్షకులకు వినోదం పంచుతుంటుంది జబర్ధస్త్ టీం. ఈ మేరకు మల్లెమాల ప్రతీ పండుగకు ఒక పేరు పెట్టి సెలబ్రెటీలను తీసుకొచ్చి ఇలాంటి వేడుకలు జరుపుతారు. ఈసారి దసరా కు కూడా ఈటీవీ మల్లెమాల ప్లాన్ చేశాయి. ‘దసరా వైభవం’ పేరిట ఘనంగా ఓ ప్రోగ్రాంను నిర్వహించారు. తాజాగా ఈ షో ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. గెటప్ శ్రీను ఓ సినిమాలో కమల్ హాసన్ వేసిన 8 […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2022 / 07:16 PM IST
    Follow us on

    Minister Roja: ప్రతీ ఈవెంట్ కు ఓ ప్రోగ్రాంను నిర్వహించి ప్రేక్షకులకు వినోదం పంచుతుంటుంది జబర్ధస్త్ టీం. ఈ మేరకు మల్లెమాల ప్రతీ పండుగకు ఒక పేరు పెట్టి సెలబ్రెటీలను తీసుకొచ్చి ఇలాంటి వేడుకలు జరుపుతారు. ఈసారి దసరా కు కూడా ఈటీవీ మల్లెమాల ప్లాన్ చేశాయి. ‘దసరా వైభవం’ పేరిట ఘనంగా ఓ ప్రోగ్రాంను నిర్వహించారు. తాజాగా ఈ షో ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది.

    గెటప్ శ్రీను ఓ సినిమాలో కమల్ హాసన్ వేసిన 8 గెటప్ లు వేసి స్టేజీపై ఉర్రూతలూగించారు. ఇక మెగా ఫ్యామిలీలో ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న ఓ జంట కూడా జబర్ధస్త్ స్టేజీపై సందడి చేసింది.

    ఇక హైపర్ ఆది, రాంప్రసాద్ లు కూరగాయలు బండి పట్టుకొని వీధుల్లోకి వెళ్లి కామెడీ పండించారు. విశేషం ఏంటంటే ఈ షోకు జబర్ధస్త్ ను వీడి ఏపీ మంత్రి రోజా హాజరయ్యారు. ఆమెను ఘనంగా ఆహ్వానించి సన్మానం కూడా చేశారు. జబర్ధస్త్ జడ్జి నుంచి ఏపీకి మంత్రి పదవి రావడంతో వీడిపోయిన రోజాను కీర్తించారు. ఈ సందర్భంగా ఎవరెవరికి ఎలాంటి శాఖలు ఇవ్వాలన్న దానిపై రోజాతో సరదాగా గేమ్ కూడా ఆడించారు.

    అయితే స్టేజీపైనే రోజాపై హైపర్ ఆది, రాంప్రసాద్ తోపాటు జబర్ధస్త్ కమెడియన్స్ పంచులు వేయడంతో రోజా నొచ్చుకుంది. తనను ఈ వేడుకకు పిలిచి అవమానిస్తారా? అంటూ ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. చాలా రోజులకు జబర్ధస్త్ కమెడియన్స్ తో కలిసిన రోజాను ఇలా అవమానించి పంపుతారా? అని అందరూ నోరెళ్లబెడుతున్నారు. మరి ఇది ప్రోమో కోసం చేస్తున్నారా? లేక నిజంగానే నిజమా? అన్నది తెలియాల్సి ఉంది.