Hyper Aadi- Suma: బోనులో నిలబెట్టిన సుమపై హైపర్ ఆది పంచుల వర్షం..

Hyper Aadi- Suma: సినిమాలు, సీరియల్స్ కన్నా స్పెషల్ ఈవెంట్స్ ఈమధ్య బాగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో కమెడీయన్ల ఫర్ఫామెన్స్ తో నవ్వులు పూయిస్తున్నారు. జబర్దస్త్ లో కామెడీ పండించిన కొందరు నటులు ఈ షో నుంచి బయటకు వచ్చి ఇలాంటి వాటిల్లో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పారు. పంచ్ ల వర్షం కురిపిస్తూ టైమింగ్ కామెడీతో ఆడియన్స్ ఆకట్టుకోవడం ఆయనకు బాగా తెలుసు. […]

Written By: Chai Muchhata, Updated On : April 3, 2023 11:18 am
Follow us on

Hyper Aadi- Suma

Hyper Aadi- Suma: సినిమాలు, సీరియల్స్ కన్నా స్పెషల్ ఈవెంట్స్ ఈమధ్య బాగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో కమెడీయన్ల ఫర్ఫామెన్స్ తో నవ్వులు పూయిస్తున్నారు. జబర్దస్త్ లో కామెడీ పండించిన కొందరు నటులు ఈ షో నుంచి బయటకు వచ్చి ఇలాంటి వాటిల్లో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పారు. పంచ్ ల వర్షం కురిపిస్తూ టైమింగ్ కామెడీతో ఆడియన్స్ ఆకట్టుకోవడం ఆయనకు బాగా తెలుసు. లేటేస్టుగా ‘రావణాసుర’ సినిమా ప్రమోషన్లో ఈయన చేసిన సందడికి అంతా ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా హైపర్ ఆదిని బోనులో నిలబెట్టి యాంకర్ సుమ వేసిన ప్రశ్నలకు రివర్స్ పంచ్ వేయడంతో అక్కడున్న వారంతా ఘొల్లున నవ్వేశారు.

‘పంచ్ లకు బాగా ఫేమస్ అయ్యారా..? లేక స్పీచ్ లకు గుర్తింపు పొందారా.. అని తెలుసుకునేందుకు హైపర్ ఆదిని బోనులోకి రావాలని కోరుతున్నాం..’ అని సుమ అనగానే హైపర్ ఆది బోనులోకి వస్తాడు. ‘ఈ అద్దంలో మీ ఫేస్ చూసి అంతా నిజమే చెబుతాను.. అబద్దం చెప్పను.. అని ప్రమాణం చేయండి..’ అని సుమ అడగగా.. ‘అసలు మీరు చూసుకుని ఉంటే ఇందాకా వచ్చేది కాదు..’ అని ఆది కౌంటర్ ఇస్తాడు.. ఇక ఆ తరువాత ‘మీకు పెళ్లయిందా? అని నేను అడగట్లేదు..’ అని సుమ ప్రశ్నించగా.. ‘అయ్యిందని నేనూ చెప్పట్లేదు’ అని ఆది రిప్లై ఇస్తాడు.

Hyper Aadi- Suma

ఇలా ఇద్దరి మధ్య జరిగిన సంభాషనలోకి ప్రవీణ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తరువాత ముగ్గురు కలిసి అక్కడున్న వాళ్లను సంతోష పెడుతారు. అయితే ఈవెంట్ ఏదైనా హైపర్ ఆది వేసే పంచ్ లు మాత్రం ఆకట్టుకుంటాయని చెబుతూ ఉంటారు. అక్కడున్న వారికి ఆకట్టుకునే విధంగా టైమ్ సెన్స్ పంచ్ లు వేయడం ఆకట్టుకుంటుంది. అందుకే హైపర్ ఆది ఉన్న ప్రొగ్రామ్స్ బాగా హిట్టు కొడుతూ ఉంటాయి. ‘రావణాసుర’ ప్రమోషన్లో వీరు చేసిన కామెడీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా రవితేజ నటించి, నిర్మాతగా వస్తున్న మూవీ ‘రావణాసుర’. ఏప్రిల్ 7న థియేటర్లో సందడి చేయనుంది. ఇందులో రవితేజ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. తన సొంత సినిమా కావడంతో రవిజేత యాక్షన్ తో ఇరగదీశారని అంటున్నారు. ఆయన ఇదివరకు నటించిన ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత ‘రావణాసుర’ వస్తుండడంతో దీనిపై హోప్స్ మరింత పెరిగాయి.