https://oktelugu.com/

Salman Khan- Aryan Khan: షారుఖ్ ఖాన్ కొడుకు సంస్కారం చూశారా? సల్మాన్ ఖాన్ ను చూసి ఏం చేశాడంటే?

Salman Khan- Aryan Khan: యావత్ సినీ ప్రంచంలో షారుఖ్ ఖాన్ గురించి తెలియని వారుండరు. బాలీవుడ్ బాద్షాగా పేరొందిన ఈయన దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘పఠాన్’ మూవీ యావరేజ్ గా హిట్టు కొట్టినా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. అయితే ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా అందరికీ సుపరిచితుడే. గతంలో డ్రగ్స్ కేసు ద్వారా ఆయన పేరు బయటకొచ్చి హల్ చల్ సృష్టించింది. అయితే అప్పటి […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 3, 2023 / 11:11 AM IST
    Follow us on

    Salman Khan- Aryan Khan

    Salman Khan- Aryan Khan: యావత్ సినీ ప్రంచంలో షారుఖ్ ఖాన్ గురించి తెలియని వారుండరు. బాలీవుడ్ బాద్షాగా పేరొందిన ఈయన దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘పఠాన్’ మూవీ యావరేజ్ గా హిట్టు కొట్టినా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. అయితే ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా అందరికీ సుపరిచితుడే. గతంలో డ్రగ్స్ కేసు ద్వారా ఆయన పేరు బయటకొచ్చి హల్ చల్ సృష్టించింది. అయితే అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ కొన్నిప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లేటేస్టుగా ఓ ఈవెంట్ లో మెరిసిన ఆయన సీనియర్, జూనియర్ హీరోయిన్లతో కలిసి ఫోజులిచ్చాడు. ఇదే సమయంలో అక్కడి కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్ ప్రవర్తనపై అంతా షాక్ తింటున్నారు.

    బాలీవుడ్ హీరోలకు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉంది. దశాబ్దాలు గడిచి ఇండస్ట్రీలోకి కొత్త హీరోలు ఎంట్రీ ఇచ్చినా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ఎవర్ గ్రీన్ హీరోలుగానే మిగిలిపోతారు. ఇప్పటికీ వారు కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ఆకట్టుకోవడం విశేషం. షారుఖ్ ఖాన్ ఇప్పటికీ హీరోగా కనిపిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ మాత్రం కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తున్నాడు. ఇటీవల తెలుగు సినిమా ‘గాడ్ ఫాదర్’లో చిరంజీవితో కలిసి నటించి తెలుగు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాడు.

    బీ టౌన్ లో జరిగే స్పెషల్ ఈవెంట్లకు సల్మాన్ ఖాన్ ను ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతారనే పేరుంది. లేటేస్టుగా ఓ ఫంక్షన్ కు ఈ సీనియర్ హీరో వచ్చాడు. అయితే అంతకుముందే షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కొందరు భామలతో కలిసి ఫొటోలు దిగాడు. తండ్రి షారుఖ్ ఖాన్ కు ఉన్న క్రేజ్ ఆయనకు కూడా ఉండడంతో ఆర్యన్ తో పిక్స్ దిగేందుకు చాలా మంది క్యూ కట్టారు. ఆర్యన్ సైతం ఏమాత్రం బెరుకు లేకుండా హీరోలా స్టైలిస్ గా ఫోజులివ్వడం అందరినీ ఆకర్షించింది.

    Salman Khan- Aryan Khan

    ఆర్యన్ ఖాన్ ఇలా అక్కడున్న భామలతో సందడి చేస్తుండగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే సల్మాన్ ను ఆహ్వానించి ఆయనతో కలిసి ఫోటోలు దిగాడు. ఆ తరువాత పక్కకెళ్లిన ఆర్యన్ మళ్లీ వచ్చి సల్మాన్ ఖాన్ తో మర్యాదపూర్వకంగా ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపాడు. తన తండ్రితో కలిసి సినిమాల్లో నటించిన సల్మాన్ ను అంతే స్థాయిలో మర్యాదగా ప్రవర్తించారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..