
Chatrapathi Hindi Remake: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శ్రీను’ అనే సూపర్ హిట్ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించింది. ఇప్పుడు మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది.
కానీ అది తెలుగు సినిమా కాదు, హిందీ సినిమా. ప్రభాస్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిపోయిన ‘ఛత్రపతి’ సినిమాని హిందీ లో రీమేక్ చేస్తుంది ఈ క్రేజీ కాంబినేషన్. ఈమధ్యనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే ఈ సినిమాకి బడ్జెట్ నిర్మాతకి చుక్కలు చూపిస్తున్నట్టు సమాచారం.#RRR మూవీ ని హిందీ లో భారీ లెవెల్ లో విడుదల చేసిన పెన్ స్టూడియోస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ చిత్రానికి ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయిలు బడ్జెట్ అయ్యిందట. కథ డిమాండ్ ని బట్టి బడ్జెట్ పెట్టడం లో తప్పు లేదు.కానీ వీవీ వినాయక్ నిర్మాతతో వేస్ట్ ఖర్చులు ఎక్కువ చెయ్యిస్తున్నాడట.కరోనా సమయం లో సెట్స్ కూలిపోయి మూడు కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లింది అట.అంతే కాదు హీరోయిన్ నూష్రాత్ బారుచ్చ కోసం మరో మూడు కోట్ల రూపాయిల పారితోషికం ఇచ్చారట. సాధారణంగా ఈమెకి ఒక్కో సినిమాకి 1.5 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ గా తీసుకుంటుంది. కానీ ఈ సినిమాలో నటింపజెయ్యడం కోసం డబుల్ రెమ్యూనరేషన్ ని ఇచ్చి తీసుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఛత్రపతి టైటిల్ ని రిజిస్టర్ చేయించడం కోసం మరో రెండు కోట్లు ఖర్చు అయ్యిందట. ఇలా కేవలం వేస్ట్ ఖర్చులే 20 కోట్లు దాటిందట.
అయితే ఇంత ఖర్చు చేసినా సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం తో ఉన్నారు మేకర్స్.ఎందుకంటే బెల్లంకొండ హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ వచ్చాయి కాబట్టి, అదే విధంగా ఛత్రపతి హిందీ డబ్ వెర్షన్ ని కూడా ఆడియన్స్ బాగా చూసారు,అలాంటి సినిమా రీమేక్ చెయ్యడం వల్ల ఏమి లాభం కలుగుతుందో చూడాలి.