Hyderabad Rape Case: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో రోజుకో నిజం బయట పడుతోంది. అత్యాచార సమయంలో నిందితులు వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. కానీ ఆ విషయం ఎక్కడ కూడా వారు వెల్లడించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐదు రోజులుగా నిందితులను విచారిస్తున్న పోలీసులకు వీడియో సంగతి మాత్రం చెప్పలేదు దీంతో వారు కంగుతిన్నారు. లైంగిక దాడి సమయంలో బెంజి, ఇన్నోవా కారులో వారు బాలికతో ప్రవర్తించిన తీరును వారి సెల్ ఫోన్లలో బంధించినట్లు పోలీసులకు తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో వారు చేసిన ఆకృత్యాన్ని వీడియో తీసి పోస్టు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఇతరుల మొబైల్ ఫోన్లలో కనిపించిన ఆధారాలతో నిందితులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.
మరోవైపు వారు అత్యాచార సమయంలో ప్రవర్తించినందుకు గాను వారి లో దుస్తులను బాలిక వెంట్రుకలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. వారిపై సాంకేతిక ఆధారాలతో నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై అభియోగాలతో పాటు ఆధారాలు చూపెట్టేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంకా సీసీ కెమెరా పుటేజీలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో వారు వాడిన సెల్ ఫోన్లలో ఎవరెవరితో చాటింగ్ చేశారనేదానిపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఎందుకు వీడియోలు తీశారు. ఎవరెవరికి పంపించారనే దానిపై ఇంతవరకు నిందితులు పెదవి విప్పకపోవడం గమనార్హం.
Also Read: KCR vs BJP: బీజేపీ రూట్ లోనే కేసీఆర్.. అదే సెంటిమెంట్ తో ఎదురుదాడి?
నేరస్తుల వ్యవహార శైలి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు చదువుకునే కళాశాల, తిరిగే ప్రాంతాలు, వారు వాడే ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ , ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వారి ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. లైంగిక దాడి తరువాత వారు వాట్సాప్ గ్రూపుల ద్వారా పలువురికి సందేశాలు పంపినట్లు తెలుసుకున్నారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
వారి అలవాట్లు, సంభాషణలు, ఆచార వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మే 30న నిందితులు పారిపోయి ఎవరితో మాట్లాడారు. ఏం సందేశాలు పంపించారు. చివరకు ఏం చేశారనేదానిపై అన్ని ఆధారాలు సంపాదిస్తున్నారు. మొత్తానికి కేసులో బలమైన ఆధారాలతో నిందితులపై కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు మాత్రం వీడియో వ్యవహారంపై పోలీసులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని వారి నుంచి ఆధారాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read:BCCI Auction Fund: వేలం ద్వారా వచ్చిన రూ.48,390 కోట్లు బీసీసీఐ ఏం చేస్తుందో తెలుసా?