BYJU’s in AP Govt Schools: జగన్ సర్కార్, బైజూస్.. కొత్త ఒప్పందం కథేంటి?

BYJU’s in AP Govt Schools: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. సర్కారు తలుచుకుంటే నిధులకు కరువా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. కానీ కొన్ని సంస్థలకు సాయం చేస్తూ సర్కారు సొమ్మును అప్పనంగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థలతో ఖర్చు చేయించాల్సిందిపోయి వాటికే నిధులు పెట్టుబడి పెట్టేందుకు తయారు కావడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఉద్దేశించిన పథకానికి ఓ సంస్థకు ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేయాలని […]

Written By: Srinivas, Updated On : June 16, 2022 6:31 pm
Follow us on

BYJU’s in AP Govt Schools: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. సర్కారు తలుచుకుంటే నిధులకు కరువా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. కానీ కొన్ని సంస్థలకు సాయం చేస్తూ సర్కారు సొమ్మును అప్పనంగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థలతో ఖర్చు చేయించాల్సిందిపోయి వాటికే నిధులు పెట్టుబడి పెట్టేందుకు తయారు కావడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఉద్దేశించిన పథకానికి ఓ సంస్థకు ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేయాలని చూస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ తన పని తాను చేసుకుపోతోంది.

BYJU’s, jagan

దావోస్ వేదికగా బైజూస్ లెర్నింగ్ యాప్ నిర్వాహకులతో జరిగిన ఒప్పందం గురించి మీడియాకు సమాచారం ఇచ్చారు. 2025లో సీబీఈఎస్ సిలబస్ నమూనాతో పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ట్యాబ్ లు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం సర్కారు చెల్లించనుంది. దీంతో బైజూస్ సంస్థ ఏం పెడుతుందో తెలియడం లేదు. మొత్తానికి సర్కారు మాత్రం బైజూస్ కు తోడ్పాటునందించేందుకు నిధులు వరదలా పారిస్తుందని సమాచారం.

Also Read: Hyderabad Rape Case: గ్యాంగ్ రేప్ : వీడియోలు ఎందుకు తీశారు? వైరల్ ఎలా చేశారు?

BYJU’s, jagan

ప్రభుత్వానికి సహకరించేందుకు సంస్థలు నిధులు పెడతాయి కానీ సర్కారే సంస్థకు నిధులు అందజేయడం విడ్డూరమే. మొత్తానికి ఏపీ సీఎం జగన్ తన ప్రతిభావంతమైన ఆలోచనల ద్వారా బైజూస్ కు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం దీనికి ఏదో సాధించినట్లు గొప్పలు చెప్పుకోవడం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బైజూస్ కు రాష్ట్రం నిధులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఇందులో ఏదో జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:KCR vs BJP: బీజేపీ రూట్ లోనే కేసీఆర్.. అదే సెంటిమెంట్ తో ఎదురుదాడి?

Tags