https://oktelugu.com/

Narikela Ganesha: గూస్ బాంబ్స్ తెప్పిస్తున్న ‘నారికేళ’ వినాయకుడు.. ఈ గణేశుడి తయారికి ఎన్ని కొబ్బరికాయలు వాడారో తెలుసా?

2023 సెప్టెంబర్ 18 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గతంలో కంటే ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలనే వాడారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోనూ 63 అడుగుల మట్టివిగ్రహాన్నే తయారు చేయడం విశేషం.

Written By:
  • Srinivas
  • , Updated On : September 21, 2023 11:01 am
    Narikela Ganesha

    Narikela Ganesha

    Follow us on

    Narikela Ganesha: విభిన్న రూపాయ.. వినాయక.. అంటారు. విఘ్నాలు తొలగింగే గణేషుడు ఆ రూపం.. ఈ రూపం.. అని కాదు ఏ రూపంలోనైనా దర్శనమిస్తాడని చెబుతారు. అందుకే వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా వివిధ రూపాల్లో విగ్రహాలను తయారు చేస్తుంటారు. అయితే వినాయక విగ్రహ నిర్మాణాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎక్కువగా ఉపయోగించడంతో పర్యావరణం దెబ్బతింటోందని ఎప్పటి నుంచో పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కాకుండా మట్టితో చేసిన విగ్రహాలు వినియోగించాలని చేస్తున్న అవగాహన కార్యక్రమాలు మెల్లగా సక్సెస్ అవుతున్నాయి. అయితే తాజాగా వినూత్నంగా కొబ్బరికాయలతో గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని కొబ్బరికాయలు? ఎన్ని రోజులు పట్టిందో తెలుసా?

    2023 సెప్టెంబర్ 18 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గతంలో కంటే ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలనే వాడారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోనూ 63 అడుగుల మట్టివిగ్రహాన్నే తయారు చేయడం విశేషం. అలాగే విశాఖ పట్టణంలోనూ భారీ విగ్రహాన్ని మట్టితో తయారు చేశారు. ఇలా మట్టితో తయారు చేసిన విగ్రహాలు వినియోగించాలన్న ప్రచారం రాను రాను సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో ఏపీలోని పార్వతిపురం జిల్లాలోని కొందరు యువకులు పర్యావరణం దెబ్బకుండా వినూత్నంగా విగ్రహాన్ని తయారు చేయాలని భావించారు. ఇందులో భాగంగా నారికేళ స్వామిని తయారు చేశారు. పూర్తిగా కొబ్బరికాయలను ఉపయోగించి వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దారు. ఈ విగ్రహానికి 1700 కొబ్బరికాయలు వినియోగించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా కొందరు యువకులు 20 రోజుల పాటు నిష్టతో ఉండి తయారు చేసినట్లు పేర్కొంటున్నారు.

    తెలుగు రాష్ట్రాల్లోనే ఆకట్టుకుంటున్న ఈ గణేశుడిని చూసేందుకు పార్వతి పురం జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల వారు తరలివస్తున్నారు. కొబ్బరికాయలను ఉపయోగించినా ఇక్కడ లంబోదరుడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడని కొందరు కొనియాడుతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఇలా పర్యావరణ సమతుల్యానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కాకుండా వినాయక విగ్రహాలను తయారు చేయాలని సూచిస్తున్నారు.