Huaxi Village: కలిసి ఉంటే కలదు సుఖం అన్నారో సినీకవి. ఐకమత్యమే మహాబలం. చలిచీమలన్ని కలిసి కాలసర్పంనే హరించినట్లు.. గడ్డిపరకలన్ని కలిసి మదపుటేనుగునే బంధించినట్లు మనం చదువుకున్నాం. అది అక్షరాలా నిజం. అండలుంటే కొండలైనా దాటొచ్చు. తోడుంటే ఎంతటి కష్టమైనా సుఖంగానే అనిపిస్తుంది. అదో చిన్న గ్రామం. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులున్న ఊరు కావడం గమనార్హం. అక్కడి రైతుల ఆదాయమెంతో తెలిస్తే డంగైపోవాల్సిందే. వారి ఆదాయం సంవత్సరానికి అక్షరాలా రూ. 10 లక్షలు. అంటే నెలకు సుమారు రూ. 84 వేల సంపాదన. దీంతో వారు దర్జాగా జీవిస్తున్నారు. ప్యాన్ సిటీ మాదిరి భోగాలు అనుభవిస్తున్నారు. ఇంతకీ వారు చేసే వృత్తి ఏంటో తెలుసా? వ్యవసాయమే.

ఇంతకీ ఈ ఊరు ఎక్కడుందో తెలుసా.
చైనాలోని హువాజీ గ్రామం ప్రపంచంలోనే అత్యధిక ధనిక గ్రామంగా ఖ్యాతి గడించింది. ఇక్కడ ఇళ్లు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. మెట్రో నగరాల్లో ఉన్న ఇళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయి. ఆధునిక హంగులు ఉంటాయి. విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగుంటుంది. దీంతో ఈ ఊరు తీరు చూస్తే మనకు ఆశ్చర్యం వేయక మానదు. ఇంతకీ వీరు ఏం చేస్తారో తెలుసా? వ్యవసాయమే కానీ ఉమ్మడి వ్యవసాయం. దీంతో లాభాలు గడించి వారి జీవన స్థితిగతులను మార్చుకున్నారు. మన అదృష్టాన్ని మార్చేది మన చేతిమీది గీతలు కాదు మన చేతలే అన్నట్లు వారి సమష్టి వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. లాభాలు గడించారు. ప్రపంచంలోనే కుబేరులుగా నిలిచారు.
Also Read: Rajamouli RRR Copied Scenes: మక్కికి మక్కీ దించాడు.. రాజమౌళి మరో కాపీ పేస్ట్
ఈ ఊరు 1961లో ఏర్పడింది. మొదట్లో వీరు కూడా కష్టాలు ఎదుర్కొన్నారు. ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయం లాభసాటిగా సాగక ఎన్నో వ్యయప్రయాసలు పడ్డారు. వారికి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అండగా నిలిచారు. వారిలో నిద్రాణమై ఉన్న శక్తులను తట్టి లేపారు. వ్యక్తి వ్యవసాయం కన్నా ఉమ్మడి వ్యవసాయమే మేలని మేల్కొలిపాడు. అందరిని ఏకం చేసి ఉమ్మడి వ్యవసాయం చేసి లాభాలుగడించారు. ప్రస్తుతం వారి ఆదాయం ఏడాది రూ. 80 లక్షలు కావడం గమనార్హం.

సామూహిక వ్యవసాయమే వారి తలరాతలు మార్చింది. అందరు ఒక్కటై చేసిన వ్యవసాయం వారికి డబ్బు సంపాదించి పెడుతోంది. ఫలితంగా లక్షలు సంపాదిస్తున్నారు. కోటీశ్వరులయ్యారు. వారి హంగులు, ఆర్భాటాలు చూస్తే మనకు ఈర్ష్య పుడుతుంది. అంతలా ఎదిగిన వారి జీవనగమనం ఒక్కసారిగా మారిపోయింది. దానికి వారు చేసిన ప్రయత్నాలే. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించి లాభసాటిగా మార్చుకున్నారు. ఆ ఊళ్లో అందరూ కోటీశ్వరులే. ఆ ఊరే ధనిక గ్రామంగా రికార్డులకెక్కడం సంచలనం.
Also Read:Bandi Sanjay: అమాయక రైతులపై అమానుష దాడులా? ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్