Pavan Kalyan Craze: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఖుషి సినిమా నుండి ఆయన ఆంధ్రా యువత కి రోల్ మోడల్ గా మారిపోయారు..ఆ సమయం లో ఏర్పడిన పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమా సినిమాకి పెరుగు పోయింది..మధ్య లో పాలిటిక్స్ లోకి వెళ్లి ఫెయిల్ అయినా కూడా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు..2021 వ సంవత్సరం లో వకీల్ సాబ్ సినిమా తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పీక్ కరోనా టైం లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించి తనకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించాడు..ఇక ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సాధారణంగా ఏ సినీ హీరో అయినా రాజకీయాల్లోకి వెళ్తే, సినీ కెరీర్ నాశనం అవుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు..కానీ పవన్ కళ్యాణ్ విషయం లో అది పూర్తిగా విరుద్ధం అని మరోసారి ప్రూవ్ అయ్యింది..ఫామిలీ ఆడియన్స్ లో కానీ, యూత్ మరియు మాస్ లో కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గింది లేదు.

పవన్ కళ్యాణ్ క్రేజ్ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అనుకుంటే అది ముమ్మాటికీ పొరపాటే..ఆయనకీ ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది..ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు మన టాలీవుడ్ కి తమ సినిమాల ప్రొమోషన్స్ కోసం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా ఉండలేరు..దంగల్ సినిమా ప్రొమోషన్స్ సమయం లో అమిర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కూడా పవన్ కళ్యాణ్ నాకు ఫేవరెట్ హీరో అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం..ఇక సల్మాన్ ఖాన్ కూడా తన దబాంగ్ 3 మూవీ ప్రొమోషన్స్ కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ని ఎత్తిన సందర్భాలు చాలానే ఉన్నాయి..కరీనా కపూర్ , అభిషేక్ బచ్చన్ ఇలా ఒక్కరా ఇద్దరా బాలీవుడ్ కి చెందిన ఎంతో మంది సూపర్ స్టార్స్ టాలీవుడ్ లో తమ సినిమాలకు ప్రొమోషన్స్ చేసుకునే సమయం లో పవన్ కళ్యాణ్ జపం చేసేవారు..ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి రణబీర్ కపూర్ కూడా చేరిపోయాడు..తన లేటెస్ట్ సినిమా బ్రహ్మాస్త్ర మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొన్న రణబీర్ కపూర్ మీడియా తో కాసేపు ముచ్చటించారు.

Also Read: Woman to Marry Herself: ఆమె పెళ్లి ఆమెతోనే!!.. దేశంలోనే తొలిసారి.. తనను తాను పెళ్లాడనున్న యువతి
అలా ఆయన మాట్లాడుతూ ‘నాకు సౌత్ సినిమాలు అంటే చాలా బాగా ఇష్టం..పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అంటే ఎంతో ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్..ఆయన పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం కేరింతలతో దద్దరిల్లిపోయింది..రణబీర్ కపూర్ తో పాటు వచ్చిన రాజమౌళి కూడా వచ్చిన ఆ రెస్పాన్స్ చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు..ఇలా బాలీవుడ్ లో ఖాన్స్ దగ్గర నుండి కపూర్స్ వరుకు ప్రతి ఒక్కరు వారి సినిమాలు తెలుగు లో విడుదల అవుతున్నప్పుడు ప్రొమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ పేరు ని వాడుకోవడం గత దశాబ్ద కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది..పవన్ కళ్యాణ్ ఇప్పటి వరుకు ఒక్క హిందీ సినిమాలో కూడా నటించలేదు..చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం రీమేక్స్ సినిమాలే..అయినా కూడా ఇతర రాష్ట్రాల్లో ఆయనకీ ఇలాంటి క్రేజ్ ఎలా వచ్చింది అనేది ట్రేడ్ పండితులకు సైతం అంతు చిక్కని ప్రశ్న..పవన్ కళ్యాణ్ తొలిసారి జానపద జానర్ లో హరిహరవీర మల్లు సినిమా ద్వారా పాన్ ఇండియా లో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో ఇతర రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఆయనని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Also Read: Aadhi Pinisetty: హాట్ టాపిక్ గా నటుడు ఆది వరకట్నం… అన్ని కోట్లు తీసుకున్నాడా!
Recommended Videos: