Sarkaru Vaari Paata Record In OTT: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారత్ అనే నేను , మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి వరుస హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సర్కారు వారి పాట సినిమా తో కూడా సూపర్ హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టే విధంగా దూసుకుపోతున్నాడు..ఇది ఇలా ఉండగా ఈ సినిమా ని ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వారు రెంటల్ బేసిస్ మీద అప్లోడ్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు అర్జెంటు గా మనం మన ఇంట్లో కూర్చొని ఈ సినిమా చూడాలి అంటే 199 రూపాయిలు కట్టాల్సిందే..అప్పుడే ఈ సినిమాని మనం చూసే ఛాన్స్..ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వారు ఈ పద్దతి ని KGF చాప్టర్ 2 ద్వారా ప్రవేశ పెట్టారు..రెస్పాన్స్ అదిరిపోయింది..అదే ఫార్ములా ని సర్కారు వారి పాట సినిమాకి కూడా పెట్టారు..దీనికి కూడా రెస్పాన్స్ అదిరిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Major Unnikrishnan: మేజర్ ఉన్నికృష్ణన్ గురించి రోమాలు నిక్కపొడిచే నిజాలు
అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా సరికొత్త రికార్డు ని నెలకొల్పింది అట..పే పర్ వ్యూ పద్దతి లో విడుదల అయినా ఈ సినిమాకి కేవలం 24 గంటల్లోనే 5 లక్షల మంది వీక్షించారు అట..అంటే కేవలం ఒక్క రోజులోనే అమెజాన్ ప్రైమ్ వారికి కోటి రూపాయిలు వచ్చాయి అన్నమాట..సినిమా విడుదల అయ్యి మూడు వారాలు అవుతున్న కూడా OTT లో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అంటే మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఇక ఈ సినిమా జూన్ 9 వ తారీఖు నుండి అమెజాన్ ప్రైమ్ లో ఉన్న కస్టమర్స్ అందరికి అందుబాటులోకి రానుంది..అప్పటి వరుకు ఈ సినిమాకి పే పర్ వ్యూ పద్దతి లో సుమారు 5 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది..మహేష్ బాబు కి ఉన్న ఫామిలీ ఆడియన్స్ క్రేజ్ ని అమెజాన్ ప్రైమ్ వాడు భలే ఉపయోగించుకున్నాడు అని సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు మురిసిపోతున్నారు.
Also Read: Chiranjeevi and Venky Kudumula: చిరు- వెంకీ ప్రాజెక్ట్ ఉందా లేదా? ఇదిగో క్లారిటీ వచ్చేసిందిగా
Recommended Videos:
[…] […]
[…] Also Read: Sarkaru Vaari Paata Record In OTT: OTT లో కూడా అరుదైన రికార్డ… […]