ప్రమాదం ఎప్పుడు ఏ విధంగా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొన్ని ప్రమాదాలను ఆపడం మనకు సాధ్యం కాకపోయినా కొన్ని సందర్భాల్లో మాత్రం సమయస్పూర్తితో వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడవచ్చు. చాలా సందర్భాల్లో వాహనంలో వేగంగా వెళుతున్న సమయంలో బ్రేకులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా ఎలా ఆపాలో ఎవరికీ అర్థం కాదు.
కారు బ్రేక్ ఫెయిల్ కావడానికి సరైన కారణం తెలిస్తే ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో మనకు సులభంగా అర్థమవుతుంది. అయితే ఆ సమయంలో మనం కారు బ్రేక్ ఎందుకు ఫెయిల్ అయిందని ఆలోచించలేం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం బ్రేక్ ఫెయిల్ అయినా సులభంగా కారును ఆపడం సాధ్యమవుతుంది. సాధారణంగా మాస్టర్ సిలిండర్ లీక్ అయినా, బ్రేక్ వైర్ తెగిపోయినా బ్రేకులు ఫెయిల్ అవుతూ ఉంటాయి.
అయితే కేవలం 8 నుంచి పది సెకన్లలో బ్రేకులు ఫెయిల్ అయిన కారును ఆపేయవచ్చు. బ్రేక్స్ ఫెయిల్స్ అయిన సమయంలో టెన్షన్ పడకుండా పనులు చేస్తే అనుకున్నది సాధ్యమవుతుంది. కారును ఆపడానికి మొదట ఎక్సిలేటర్ పై కాలును పూర్తిగా తీసివేయడంతో పాటు హ్యాండ్ బ్రేక్ ను సగం వరకు లాగే ప్రయత్నం చేయాలి. ఒక వైపు హ్యాండ్ బ్రేక్ ట్రై చేయడంతో పాటు మరోవైపు బ్రేక్స్ ను డౌన్ చేస్తూ గేర్స్ ను స్కిప్ చేయకుండా జాగ్రత్త పడాలి.
హ్యాండ్ బ్రేక్, ఇంజిన్ బ్రేకింగ్ ఉపయోగించడం వల్ల కారును అదుపు చేయడం సాధ్యమవుతుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళితే కారును అదుపు చేయడం సాధ్యమవుతుంది కానీ అంతకు మించిన వేగంతో వెళితే మాత్రం కారును కంట్రోల్ చేయడం కష్టమే. అలాంటి సమయంలో కారును పొదల్లోకి పోనిచ్చి అదుపు చేయడం మంచిది.