Number Plates: ఇండియాలో నంబర్‌ ప్లేట్స్‌ ఎన్ని రకాలు.. వాటికి అర్థం తెలుసా?

వైట్‌ప్లేట్‌పై బ్లాక్‌ కలర్‌లో నంబర్లు.. ఇలాంటి ప్లేట్‌ ఉన్న వాహనాలు ప్రైవేటు వాహనాలు. అంటే ఓన్‌ వెహికిల్స్‌ అన్నమాట. మనం బైక్, లేదా కారు కొని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఈ రంగులో నంబర్‌ ప్లేట్‌ ఇస్తారు.

Written By: Raj Shekar, Updated On : February 29, 2024 9:38 am
Follow us on

Number Plates: భారత దేశంలో రవాణాశాఖ వాహనాలకు నంబర్లు కేటాయిస్తుంది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కేటాయిస్తుంది. ఈ నంబర్‌ మనకు నచ్చింది కావాలనుకుంటే వేలంలో కొనుగోలు చేయవచ్చు. ఇక రవాణాశాఖ ఏది ఇచ్చినా తీసుకుంటే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మరి ఈ నంబర్‌ ప్లేట్లు భారత్‌లో 8 రకాలు ఉన్నాయి. వివిధ రంగుల్లో కనిపిస్తాయి. వాటికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

– వైట్‌ప్లేట్‌పై బ్లాక్‌ కలర్‌లో నంబర్లు.. ఇలాంటి ప్లేట్‌ ఉన్న వాహనాలు ప్రైవేటు వాహనాలు. అంటే ఓన్‌ వెహికిల్స్‌ అన్నమాట. మనం బైక్, లేదా కారు కొని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఈ రంగులో నంబర్‌ ప్లేట్‌ ఇస్తారు.

– పసుపు రంగు ప్లేట్‌పై నలుపు రంగు నంబర్లు.. ఇది కేవలం కమర్షియల్‌ వాహనాలకు మాత్రమే కేటాయిస్తారు. ఆర్టీసీ బస్సులు, టాక్సీలకు దీనిని కేటాయిస్తారు.

– గ్రీన్‌ ప్లేట్‌పై తెలుపు అక్షరాలు.. ఇలాంటి ప్లేట్‌ ఉన్న వాహనాలు ఎలక్ట్రిక్‌ వాహనాలను సూచిస్తాయి. ఎలక్ట్రిక్, కారు, బైక్‌లకు ఇలా గ్రీన్‌ కలర్‌లో నంబర్‌ ప్లేట్‌ కేటాయిస్తారు. ఇవి పూర్తిగా ప్రైవేటుకు చెందిన వాహనాలకే ఇస్తారు.

– గ్రీన్‌ కలర్‌ ప్లేట్‌పై యెల్లో నంబర్లు.. ఇక గ్రీన్‌ ప్లేట్‌పై పసుపు రంగు అక్షరాల ప్లేట్లు కనిపిస్తాయి. గ్రీన్‌ అంటే ఎలక్ట్రిక్‌ వాహనాలు అని అర్థం. యెల్లో నంబర్లు ఉంటే కమర్షియల్‌ వాహనాలు అని అర్థం.

– బ్లాక్‌ ప్లేట్‌పై యెల్లో నంబర్స్‌.. ఇది కేవలం సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలకు మాత్రమే కేటాయిస్తారు.

– బ్లాక్‌ ప్లేట్‌పై వైట్‌ లెటర్స్‌ విత్‌ యారో.. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్సు సిబ్బందికి మాత్రమే కేటాయిస్తారు.

– బ్లూ ప్లేట్‌పై వైట్‌ లెటర్స్‌.. ఈ ప్లేట్‌ కేవలం విదేశాలకు చెందిన ఎంబసీ అధికారులు, సిబ్బందికి సంబంధించిన వాహనాలకు ఇలాంటి నంబర్‌ ప్లేట్‌ ఇస్తారు.

– రెండ ప్లేట్‌.. ఇది కేవలం కొందరికే ఇస్తారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్ల వామనాలకు మాత్రమే ఇలాంటి నంబర్‌ ప్లేట్‌ ఉంటుంది.