Meesaala Guruvappa: మీసాల గురువప్ప (Meesala Guruvappa) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి సువార్తకుడిగా.. పాస్టర్ గా అతడు సుపరిచితమే. మీసాల గురువప్ప స్వస్థలం ఖమ్మం జిల్లా. గురువప్ప బంధువులు ఆదివాసి తెగకు చెందినవారు.. వీరికి పోయే జాతిలో అనేక రకాల ఆచారాలు, మూడ నమ్మకాలు ఉంటాయి. అయినప్పటికీ గురువప్ప తల్లి క్రైస్తవ మతాన్ని అనుసరించడం మొదలుపెట్టింది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేది. అయితే ఇది నచ్చని కోయ జాతి వారు గురువప్ప తల్లిని చెట్టుకు తాళ్లతో కట్టివేసి కొట్టారు. దీంతో ఆమె ఆ దెబ్బలకు తట్టుకోలేక చనిపోయింది.. ఆ తర్వాత కోయ జాతిలో ఆచారం ప్రకారం తల్లి చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడిని తమ ఆదిమ జాతికి చెందిన దేవుడికి బలి ఇచ్చారు.. అటు తల్లిని కోల్పోయి.. ఇటు సోదరుడిని నష్టపోయి గురు వప్ప చాలా సంవత్సరాలుగా మానసికంగా ఇబ్బంది పడ్డారు. కొద్దిరోజుల పాటు ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయారు. ఒంటరిగా ఉండిపోయారు. చివరికి తన తల్లి అనుసరించిన క్రైస్తవ మతాన్ని ఆయన ఆచరించడం మొదలుపెట్టారు. ఈసారి తమ కోయ జాతి వారిని ఎదిరించారు. వారు ఎలాంటి మాటలు మాట్లాడినా.. ఎంత ఇబ్బందులు పెట్టాలని చూసినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. చివరికి పాస్టర్ గా ఎదిగారు. తమ కోయ జాతి వారు మాట్లాడే మాటల్లోనే పాటను రూపొందించారు. అలా తెరపైకి వచ్చిందే కోయారే కోయ (khoyare khoya) అనే పాట.
సోషల్ మీడియా ను ఊపేస్తోంది
కోయా రే కోయ పాట సోషల్ మీడియాను కొద్దిరోజులుగా ఊపేస్తోంది. ఇన్ ఫ్లూ యన్ సర్ (influencer) లు ఈ పాటను తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పాట సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లో ఈ పాట తెగ కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా మీసాల గురువప్ప ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అయితే ఆయన జీవితం గురించి తెలుసుకున్న వారు మొత్తం కన్నీరు పెడుతున్నారు..” ఆయన ఏదో తనకు తెలిసిన పదాలతో పాట రూపొందించారని భావించాం. కానీ ఆయన జీవిత చరిత్ర చూసిన తర్వాత బాధ కలుగుతోంది. దుఃఖం వస్తోంది. తన బాధను మర్చిపోవడానికి.. ఇలాంటి పాటలు రూపొందించారేమో అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆయన పాటతో నవ్విస్తున్నారు. ఎదుటివారి బాధలను రూపుమాపే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకు మించిన గొప్ప ప్రయత్నం ఏముంటుంది. ఆయన మరింతగా వర్ధిల్లాలని కోరుకుంటున్నామని” నెటిజన్లు పేర్కొంటున్నారు.