https://oktelugu.com/

Game Changer and Devara : ‘దేవర’ ని మించిన హిందీ వెర్షన్ ‘గేమ్ చేంజర్’ అడ్వాన్స్ బుకింగ్స్..ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందంటే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : January 8, 2025 / 03:40 PM IST

    Devara , Game Changer

    Follow us on

    Game Changer and Devara : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మెల్లగా ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే నార్త్ ఇండియా , కర్ణాటక, చెన్నై, ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైంది. ఆంధ్ర ప్రదేశ్ లో పలు చోట్ల బుకింగ్స్ మొదలయ్యాయి కానీ, తెలంగాణ లో మాత్రం ఇంకా కాలేదు. నేడు సాయంత్రం నుండి ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ‘గేమ్ చేంజర్’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ స్థాయిలోనే రికార్డ్స్ ని బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ బుకింగ్స్ అక్కడి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

    పుష్ప 2 స్థాయిలో అయితే బుకింగ్స్ లేవు కానీ, ‘దేవర’ కంటే ఎక్కువ ఉందని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం దేవర చిత్రానికి హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా విడుదలకు ముందు 5 వేల టిక్కెట్లు అమ్ముడుపోతే, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి అప్పుడే 11 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని, 13 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. మూవీ టీం నుండి ఆశించిన రేంజ్ లో ప్రోమోషన్స్ లేకపోవడం పెద్ద మైనస్ అయ్యిందని, లేకపోతే మొదటి రోజు ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేదని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 9 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

    సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని, ఏదైనా జరగొచ్చని అంటున్నారు. ‘దేవర’ చిత్రానికి హిందీ వెర్షన్ లో 60 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి హిందీ వెర్షన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 100 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు రావాలి?, మరి ఆ రేంజ్ వసూళ్లు ఫుల్ రన్ లో వస్తుందా లేదా అనేది చూడాలి. హిందీ ఆడియన్స్ పల్స్ ని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. వాళ్ళు ఎప్పుడు ఏ సినిమాకి కనెక్ట్ అవుతారు అనేది ఎవ్వరూ చెప్పలేరు. కానీ కనెక్ట్ అయితే మాత్రం చరిత్రలో ఎప్పుడూ చూడని వసూళ్లను చూపిస్తారు. పుష్ప 2 చిత్రానికి కేవలం హిందీ వెర్షన్ నుండి 800 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ‘గేమ్ చేంజర్’ అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.