Dry Fruits Benefits : ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అందరికి శ్రద్ధ పెరుగుతోంది. ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్) తింటే కలిగే లాభాలపై అందరికి గురి పెరుగుతోంది. దీంతో ఖర్చు ఎక్కువైనా సరే వాటిని కొనుగోలు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. జీడిపప్పు, బాదంలలో ఉండే కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పిస్తాలో బీ6 విటమిన్ గుండె జబ్బులను నివారిస్తుంది. ఇందులో ఉండే కొవ్వులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. ఎండు ఫలాల తీసుకుని మన నాడీ వ్యవస్థను బాగు చేసుకునేందుకు వాటిని తినాలని చూస్తున్నారు.
ఇక ఖర్జూరాలు కూడా మనకు ఎంతో ఉపకరిస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడటానికి దోహదం చేస్తాయి. రక్తనాళాల్లో సమస్యలు రాకుండా చేస్తాయి. ఖర్జూరాలు తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ఎండు ద్రాక్షల్లో ఐరన్ ఉంటుంది. ఇవి రక్తహీనత రాకుండా నివారిస్తాయి. ఇందులో పాస్పరస్, పొటాషియం, మెగ్నిషియం రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.
జీడిపప్పులో రాగి సత్వం ఉంటుంది. దీంతో మన శరీరానికి శక్తి వస్తుంది. మెగ్నిషియం, కాల్షియం, కండరాలు, చిగుళ్ల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఎండు ద్రాక్షల్లో విటమిన్ ఎ, కాల్షియం ఉంటుంది. ఇవి ఎముకల పుష్టికి సాయపడతాయి. కంటి చూపు మందగించకుండా తోడ్పడుతుంది. బాదం పప్పులో కాల్షియంతో పాటు విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఎముకల ఇమ్యూనిటీకి సాయపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
బాదంలు పొట్టు తీయకుండా తింటేనే మంచిది. అలా తింటే అందులో ఉండే ప్రొటీన్లతో మన గుండెకు కాపలాగా నిలుస్తాయి. పొట్టులో కూడా మనకు మంచి చేసే విటమిన్లు ఉండటం గమనార్హం. అక్రోట్లు కూడా మనకు ఎన్నో విధాలుగా రక్షణ కల్పిస్తాయి. ఇందులో ఒమేగా 3 కొవ్వు, ఆమ్లాలు ఉంటాయి. మెదడుకు ఇవి ఎంతో మేలు కలిగిస్తాయి. దీంతో ఎండు ఫలాలు ఎక్కువగా తీసుకుంటే మనకు మంచి లాభాలు ఉన్నందున వాటిని మనం నిరంతరం తీసుకుంటూ ఆరోగ్య పరిరక్షణ చేసుకుంటే మంచిది.