https://oktelugu.com/

Alia Bhatt Ranbir Kapoor : బ్రేకింగ్ న్యూస్…  పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన అలియా భట్!

Alia Bhatt Ranbir Kapoor : ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ అలియా భట్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. నవంబర్ 6 ఉదయం అలియా భట్ కి ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అలియా భట్ తో పాటు పాప ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో అలియా భట్ పాప ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. అలియా తల్లి అయ్యారని తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2022 / 01:28 PM IST
    Follow us on

    Alia Bhatt Ranbir Kapoor : ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ అలియా భట్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. నవంబర్ 6 ఉదయం అలియా భట్ కి ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అలియా భట్ తో పాటు పాప ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో అలియా భట్ పాప ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. అలియా తల్లి అయ్యారని తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేడిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
     
    బ్రహ్మాస్త్ర మూవీ కోసం అలియా-రన్బీర్ కపూర్ కలిశారు. ఆ మూవీ సెట్స్ లో వీరిద్దరి పరిచయం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. దీంతో లవ్ ప్రపోజ్ చేసుకున్నారు. రెండేళ్ల క్రితమే రన్బీర్-అలియా రిలేషన్ లో ఉన్నట్లు ప్రకటించారు. పెళ్ళికి ముందే విహారాలు చేయడం, ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొనడం చేశారు. రన్బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ అనారోగ్యంతో మరణించగా అలియా అక్కడే ఉండి మద్దతుగా నిలిచారు. చదువుకునే రోజుల్లోనే రన్బీర్ తన క్రష్ గా ఉన్నట్లు అలియా ఒక సందర్భంలో చెప్పారు.
     
    ఇక 2022 ఏప్రిల్ 14న అలియా-రన్బీర్ వివాహం ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్ళైన రెండు నెలలకే అలియా తాను గర్భం దాల్చానని ప్రకటించారు. జూన్ నెలలో ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన అలియా నవంబర్ లో ఆడపిల్లను కన్నారు. ప్రస్తుతం అలియా వయసు 29 కాగా హీరోయిన్స్ కోణంలో చాలా తక్కువ వయసులో తల్లి అయినట్లు లెక్క. ఇక రన్బీర్ కెరీర్లో దీపికా, కత్రినా, ప్రియాంక ఇలా పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపారన్న వాదన ఉంది.  
     
    ఆర్ ఆర్ ఆర్ మూవీతో అలియా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ చిత్రంలో రామ్ చరణ్ ప్రేయసి సీతగా ఆమె కనిపించారు. అలియా పాత్రకు పెద్దగా నిడివి లేకున్నప్పటికీ కథలో కీలకంగా ఉంటుంది. భర్త రన్బీర్ కి జంటగా ఆమె బ్రహ్మాస్త్ర చిత్రం చేశారు. ఇది తెలుగులో కూడా విడుదలైంది. కాగా ఎన్టీఆర్ 30 మూవీకి అలియా సైన్ చేసి తర్వాత తప్పుకున్నారు. రన్బీర్ తో వివాహం ఆలోచనలతో ఆమె ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు.