Blue Moon 2023: అంతరిక్షం ఒక అద్భుతం. ఇక్కడన్నీ కొత్త కొత్త ఆవిష్కరణలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. చాలా వరకు మనకు ఇవి తెలియవు. కానీ కొన్ని మాత్రం మన కళ్లముందే జరుగుతూ ఉంటాయి. తాజాగా ఆకాశంలో ఆగస్టు 30న ఓ అద్భుతం జరగబోతుంది. జాబిల్లి బ్లూ మూన్ గా కనిపించనుంది. బ్లూ మూన్ అంటే చంద్రుడు నీలం రంగులోకి మారడం కాదు. చంద్రుడిపై ఎక్కువ భాగం కాంతి పడుతుంది. దీంతో పరిమాణంలో జాబిల్లి పెద్దగా అయినట్లు కనిపిస్తుంది. ఇ లాంటి అద్భతం 10 నుంచి 20 ఏళ్ల కొకసారి మాత్రమే జరుగుతుంది. 2009లో బ్లూ మూన్ కనిపించినట్లు నాసా పేర్కొంది. ఇప్పుడు ఆగస్టు 30న బ్లూమూన్ ను చూడొచ్చు. తిరిగి దీనిని 2032 లో చూస్తారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లూమూన్ ఎలా ఏర్పడుదుంది? అంటే?
భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం చంద్రుడు. ప్రతీ నెలకొసారి పౌర్ణమిరోజున చంద్రుడు నిండుగా అత్యంత కాంతివంతంగా కనిపిస్తాడు. కానీ ఈసారి మాత్రం భూమికి అతి దగ్గరగా వస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం చంద్రుడి వెలుగు అధికంగా ఉంటుంది. పరిమాణంలోనూ భారీగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి కక్ష్యకు దగ్గరగా వచ్చిన సమయంలో ఈ అద్భుతం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితినే బ్లూమూన్ గా పిలుస్తారు.
సాధారణంగా ప్రతీ ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్ లు ఏర్పడుతాయి. కానీ బ్లూమూన్ మాత్రం 10 లేదా 20 సంవ్సరాల మధ్యలో ఎప్పుడైనా రావొచ్చు. ఒక నెలలో రెండు పౌర్ణమిలు వస్తే దానిని బ్లూ మూన్ గా పిలుస్తారు. ఆగస్టు 1వ తేదీన పౌర్ణమి సంభవించగా.. ఇప్పుడు ఇదే నెల 30న పౌర్ణమి ఏర్పడింది. దీంతో ఆగస్టు 30న ఏర్పడే పౌర్ణమిని బ్లూ మూన్ గా పిలుస్తున్నారు. బ్లూ మూన్ ఆ తరువాత 2032 లేదా 2037 లో వస్తుందని చెబుతున్నారు.
భూమికి చంద్రుడు దగ్గరలో ఉన్నప్పుడు అనుచరుడు అని పిలుస్తారు. దూరంగా వెళ్లినప్పుడు అపాసుర అంటారు. బుధవారం చంద్రుడు భూమికి అతి దగ్గరగా వస్తున్నందున అనుచరుడు అని అంటారు. కింది స్థితిలో చంద్రుడిపై పడే కాంతి మరింత వెలుగుగా మనకు కనిపిస్తుంది. అప్పుడు చంద్రుడు పరిమాణంలో పెద్దగా ఉన్నట్లు తెలిస్తుంది. చంద్రుడిపై కాంతి పడడం వల్ల తెల్లగా కనిపిస్తాడు. బ్లూ మూన్ అన్నంత మాత్రాన నీలం రంగులో కనిపించడు.