Ritu Chaudhary: ఎదపై సుడిగాలి సుధీర్ టాటూ.. రీతూ చౌదరి చేసిన పనితో రష్మీతో పాటు ఫ్యాన్స్ షాక్..

ఒకప్పుడు జబర్దస్త్ లో కొనసాగిన సుడిగాలి సుధీర్.. ఇప్పుడు ఇతర ఛానెళ్లలో కొనసాగుతున్నారు. కొన్ని సినిమాల్లో హీరోగా కనిపించి సుధీర్.. వెండితెరపై స్టార్ కాలేకపోయాడు.

Written By: Chai Muchhata, Updated On : August 30, 2023 2:01 pm

Ritu Chaudhary

Follow us on

Ritu Chaudhary: జబర్దస్త్ ప్రోగ్రాం ఎంతోమందికి జీవితాన్నిచ్చింది. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్లకు ఇదో మంచి వేదికగా మారింది. చాలామంది ఇప్పుడు సినిమాల్లో కొనసాగుతున్న వాళ్లు ఒకప్పుుడు ఇందులో కమెడియన్లుగా కొనసాగిన వాళ్లే. అయితే ప్రముఖ కమెడియన్ లు జబర్దస్త్ ను వీడినా కొత్త కొత్త వాళ్లు ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లోనూ తన యాక్టింగ్ తో అదరగొడుతున్నారు. అలా తన ప్రతిభతో పాపులారిటీ తెచ్చుకుంది రీతూ చౌదరి. లేటెస్ట్ గా ఈమె చేసిన ఓ పనికి సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. ఇంతకీ రీతూ చౌదరి ఏం చేసింది? ఆమె గురించి ఎందుకంత చర్చించుకుంటున్నారు?

ఒకప్పుడు జబర్దస్త్ లో కొనసాగిన సుడిగాలి సుధీర్.. ఇప్పుడు ఇతర ఛానెళ్లలో కొనసాగుతున్నారు. కొన్ని సినిమాల్లో హీరోగా కనిపించి సుధీర్.. వెండితెరపై స్టార్ కాలేకపోయాడు. అందుకే మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. సుధీర్ పర్ఫామెన్స్ తో ఆయనకు యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ చేస్తుంటారు. తాజాగా సుధీర్ కు సంబంధించి ఓ చర్చ పెట్టారు. అదేంటంటే? రీతూ చౌదరి తన గుండెల మీద సుధీర్ టాటూ వేసుకుంది.

గతంలో జబర్దస్త్ లో కొనసాగిన సమయంలో సుధీర్, రష్మీ ల మధ్య లవ్ ట్రాక్ కొనసాగిన విషయం తెలిసిందే. జబర్దస్త్ వేదికపై వీరు కలిసి వచ్చారంటే యూత్ లో సందడిగా ఉండేది. వీరు జంటగా కనిపించాలని చాలా మంది కోరుకున్నారు. జబర్దస్త్ యాజమాన్యం కూడా వీరిని కలిపి ఎక్కువగా చూపించేవారు. ఒక దశలో వీరిద్దరు డీప్ లవ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అని ప్రచారం చేశారు. కానీ సుధీర్ తో పాటు రష్మీ కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో వీరి మధ్య ఏం లేదని తెలిసిపోయింది.

అయితే తాజాగా రీతూ చౌదరి తన చెస్ట్ పై సుధీర్ టాటూ వేసుకుని కనిపించింది. హాట్ హాట్ గా యూత్ ను అలరిస్తున్న రీతూ చౌదరి స్లీవ్ లెస్ డ్రెస్ వేయడంతో ఈ టాటూ విషయం బయటపడింది. దీంతో ఆ టాటూ వేసుకోవడానికి కారణమేంటని సోషల్ మీడియాలో చర్చలు పెడుతున్నారు. మరోవైపు మొన్నటి వరకు రష్మీతో రొమాన్స్ చేసిన సుధీర్ టాటూను ఇప్పుడు రీతూ వేసుకోవడమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంగా రీతూ చౌదరి తోటి నటుడు అజహార్ తో లవ్లో ఉన్న విషయం లీక్ అయింది. మరి సుధీర్ టాటూ ఎందుకు వేసుకుంది? అని అంటున్నారు. అయితే కొందరు మాత్రం అభిమాన నటులను టాటూ వేసుకోవడం కామన్ అని అంటున్నారు.,