
Washing Powder Nirma: ‘వాషింగ్ పౌడర్ నిర్మా.. పాల్లలోని తెలుపు.. నిర్మాతో వచ్చింది’ అంటూ టీవీల్లో వచ్చే ఈ యాడ్ 1980 దశకంలో ఫేమస్. ఈ యాడ్ కారణంగా అప్పటి వరకు ఇతర డిటర్జెంట్ సబ్బులు వాడేవారు… రాత్రికి రాత్రే నిర్మా సబ్బులు కావాలని కిరాణ షాపుల్లో అడిగారట. తాము నిర్మా తప్ప ఇంకేమీ వాడమనే స్థితికి వచ్చారట. సైకిల్ పై ఇంటింటికి వెళ్లి పరిచయమైన నిర్మా సోప్ ఆ తరువాత దేశంలోని ప్రతి మూలన వెళ్లి పరిచయం అయింది. సామాన్యులకు అందుబాటు ధరల్లో.. నాణ్యమైన సబ్బులను, పౌడర్ ను అందించిన నిర్మా కంపెనీని ఏర్పాటు చేసిన కర్సన్ భాయ్ పటేల్ జీవితంలో పెద్ద విషాదమే నెలకొంది. అంతేకాకుండా నిర్మా ప్యాకెట్లపై ఉన్న పాప గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు.
భారత మార్కెట్లలో ఇప్పటికీ నిర్మా వాషింగ్ పౌడర్ అందుబాటులో ఉంది. కానీ కాల క్రమంలో వచ్చిన నూతన డిటర్జెంట్ లతో నిర్మా ప్రొడక్ట్ తట్టుకోవడం లేదు. కానీ ఆ కాలంలో నిర్మా ప్రభంజనాన్ని ఎవరూ తట్టుకోలేదు. గుజరాత్ కు చెందిన కర్సన్ భాయ్ పటేల్ తన రీసెర్చ్ తరువాత 1969లో డిటర్జెంట్ పౌడర్ ను తయారు చేశారు. తాను రోజంతా ఇతర ఉద్యోగం చేస్తూనే.. సాయంత్రం డిటర్జెంట్ తయారు చేసేవారు. ఈ ప్రొడక్ట్ ను ఆయన ఇంటింటికి సైకిల్ పై వెళ్లి రూ.3కి అమ్మేవారు. అలా మెల్లగా అహ్మదాబాద్ అంతటా నిర్మా పరిచయం అయింది.
కర్సన్ భాయ్ పటేల్ కు ‘నిరుపమ’ అనే కూతురు ఉండేది. ఈమెను ముద్దుగా ‘నిర్మా’ అని పిలుచుకునేవారు. ఈమె ఎప్పటిలాగే స్కూల్ కెళ్లి తిరిగి వస్తుండగా దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో కర్సన్ భాయ్ పటేల్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే కొన్నాళ్ల తరువాత కర్సన్ మళ్లీ నిర్మా డిటర్జెంట్ ను అమ్మడం ప్రారంభించారు. అలా గుజరాత్ మొత్తం నిర్మా ను ఆదరించారు.

అయితే దీనిని దేశ వ్యాప్తంగా విస్తరించాలని అనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని ఏజెన్సీలు ముందుకు వచ్చి నిర్మా ప్రొడక్ట్ ను తీసుకొని విక్రయించడం ప్రారంభించారు. కానీ అరువుకు తీసుకెళ్లిన వారు డబ్బులు ఇవ్వలేదు. దీంతో కొన్ని రోజుల పాటు కర్సన్ భాయ్ పటేల్ నష్టాలను చవి చూశారు. దీంతో తీవ్రంగా ఆలోచించిన ఆయన టీవీ ప్రకటన ద్వారా నిర్మా ప్రొడక్ట్ ను పరిచయం చేయాలని అనుకున్నారు. ఈ ప్రకటనల తన కూతురు బొమ్మ వచ్చే లా చూసుకున్నారు. అలా సునీల్ చాద్ అందించిన మ్యూజిక్ తో పాటు కర్సన్ భాయ్ కూతరు బొమ్మ ఆకర్షించడంతో నిర్మాత ప్రొడక్టుకు మళ్లీ ప్రాణం పోసినట్లయింది.
దేశంలో నేటికి నిర్మా ఉత్పత్తులను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం 20 శాతం మార్కెట్ వాటాను, డిటర్జెంట్ లో 35 శాతం కలిగి ఉంది. సైకిల్ పై మొదలైన కర్సన్ బాయ్ జర్నీ దేశ వ్యాప్తంగా అందరి నోటీ నిర్మా పలకడంతో ఆయన ఎంతో సంతోషించారు. కానీ తాను గాబరంగా పెంచుకున్న కూతురు తన కళ్ల ముందు లేకపోవడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఇదిలా ఉండగా త్వరలో భారతదేశంలో త్వరలో అత్యుత్తమ ఎంపికలో ఒకటి కానుంది.