
Bala Gopaludu Child Artist: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు కొనసాగుతున్న వారిలో చాలా మంది ఒకప్పుడు బాల నటులుగా అలరించిన వారే. అయితే కొందరు తమ బ్యాక్రౌండ్, నటనతో స్టార్లుగా మారారు. మరికొందరు మాత్రం కొన్ని సినిమాలు తీసి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. నందమూరి బాలకృష్ణ నాటి నుంచి చేటి వరకు స్టార్ గానే కొనసాగుతున్నారు. ట్రెండ్ కు తగిన సినిమాలు తీస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయనతో నటించిన చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఆ తరువాత హీరో, హీరోయిన్లుగా వచ్చారు. అయినా బాలకృష్ణ వారికి పోటీనిస్తూ నిలబడడం విశేషం. లేటేస్టుగా ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బాలకృష్ణ పక్కన ఓ అమ్మాయి చంద్రవంక వలె నవ్వుతూ కనిపిస్తోంది. ఈమె అప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా.. ఆ తరువాత ఆయనతో హీరోయిన్ గా ఓ సినిమాలో నటించింది. మరి ఆమె ఎవరో తెలుసుకోండి.
ఈ ఫొటో ‘బాలగోపాలుడు’ చిత్రంలోనిది. కోడిరామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. ఇందులో సుహాసిని, మోహన్ బాబు తదితరులు నటించారు. వీరితో పాటు ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించారు. అయితే ఇందులో అబ్బాయిని చూస్తే గుర్తుపట్టొచ్చు. కానీ అమ్మాయి మాత్రం అస్సలు గుర్తుపట్టకుండా ఉన్నారు. అమె కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరో చూద్దాం.

ఈ ఇద్దరు బాల నటుల్లో ఒకరు కల్యాణ్ రామ్. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎందరో నటులు పరిచయం అయ్యారు. కళ్యాణ్ రామ్ బాల గోపాలుడు ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మాస్ హీరో స్థాయికి ఎదిగారు. సైలెంట్ గా సినిమాలు తీస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు. ఓ వైపు నటుడిగా.. మరోవైపు నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
ఇక ఇందులో ఉన్న అమ్మాయి ఎవరో కాదు అందాల ‘రాశి’. రాశి ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం తక్కవయ్యారు. కానీ చైల్డ్ ఆర్టిస్టుగా ఆమె చాలా సినిమాల్లో నటించారు. ఈ సినిమా తరువాత ఆదిత్య 369తో మరోసారి బాలకృష్ణతో నటించారు. అంతేకాకుండా పెరిగి పెద్దయి హీరోయిన్ అయ్యాక ‘కృష్ణ బాబు’ సినిమాలో బాలయ్య పక్కన స్టెప్పులు కూడా వేసింది. అయితే రాశి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. మరోవైపు కొన్ని సీరియళ్లలో కనిపిస్తూ అలరిస్తోంది.