High Temperatures: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోతక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫలితంగా ఎండ ధాటికి రోడ్లపై జనం కనిపించకుండా పోతున్నారు. ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గత 122 ఏళ్ల కాలంలో లేని వేడి ఈ సారి ఉంటోంది. దీంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ నుంచి ఉపశమనానికి కూలర్ల, ఫ్యాన్లు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మార్చి నెలలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 33.10 డిగ్రీలుగా నమోదైంది. దీంతో వాతావరణంలో వస్తున్న మార్పుల ఆధారంగా సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది.
ప్రతి పది సంవత్సరాలకొకసారి హీట్ వేవ్ రోజుల సంఖ్య పెరుగుతోంది. అది 1981-90 కాలంలో 413 రోజులు, 2011-20 మధ్యలో 600 రోజులుగా నమోదైంది. దీంతో గ్లోబల్ వార్మింగ్ ప్రకారం నగరీకరణ, అడవుల నరికివేత తదితర కారణాలతో దేశంలో 72 శాతం ప్రాంతాల్లో వేడి 89 శాతానికి పెరుగుతోంది. దీంతో రాబోయే కాలంలో కూడా మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా భూతాపం ప్రతి ఏడాది ఓ సెంటిగ్రేడ్ చొప్పున ఎక్కువ అవుతోంది.
1960-2009 కాలంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత 0.5 సెంటిగ్రేడ్ పెరగడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా ప్రాంతాలు వేడి, పొడి గాలుల ప్రభావంతో జనం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా జనం రోడ్ల మీదికి రావడంతోనే వేడి పెరుగుతోంది. జనాభా ఉద్యోగాల నేపథ్యంలో ఎక్కువగా తిరగడం వల్ల సమస్యలు కొనితెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఆరోగ్యాలు దెబ్బతినడంతో వడదెబ్బ ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటున్నాయి.
దీంతో విద్యుత్ వినియోగం కూడా ఏకంగా పెరిగిపోతోంది. ప్రభుత్వాలు కూడా సరైన రీతిలో విద్యుత్ సరఫరా చేయకపోవడంతో కూడా జనం ఇళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో అయితే ఎడాపెడా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఫలితంగా ప్రజలు నానా తంటాలు పడాల్సి వస్తోంది. మునుముందు ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో తెలియడం లేదు. ముందుంది అసలు కాలం. మే నెలలో ఎండలు మండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read:KGF Krishna Ji: కేజీఎఫ్ లో కన్పించిన ‘తాత’.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కాల్సిందే..!