Homeఎంటర్టైన్మెంట్Sreelela: ఆ యంగ్ బ్యూటీ మహేష్ నే పట్టేసిందిగా !

Sreelela: ఆ యంగ్ బ్యూటీ మహేష్ నే పట్టేసిందిగా !

Sreeleela: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో క్రేజీ యంగ్ బ్యూటీ శ్రీ లీల యాక్ట్ చేయబోతుంది. హీరోయిన్ పూజా హెగ్డేకి సిస్టర్ గా ఆమె నటించబోతుందని కొత్త రూమర్ వినిపిస్తోంది. అయితే, ఈ రూమర్ లో వాస్తవం ఎంత ఉందని ఆరా తీస్తే ఇది నిజమే అని త్రివిక్రమ్ టీంలోని ఓ సభ్యుడు చెప్పుకొచ్చాడు. మహేష్ ఆమెను రిఫర్ చేశాడని.. రాఘవేంద్రరావు రిక్వెస్ట్ చేయగా మహేష్ శ్రీ లీల ఛాన్స్ ఇచ్చాడు.

Sreeleela
Sreeleela

ఈ సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తిపరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో భారీ సీన్స్ రాయాల్సి వస్తోంది. సహజంగా త్రివిక్రమ్ కి కొన్ని అలవాట్లు ఉన్నాయి. తన ప్రతి సినిమాలో తన అభిరుచికి తగ్గట్టు త్రివిక్రమ్ కచ్చితంగా ఓ భారీ ఫైట్ ను డిజైన్ చేస్తాడు.

Also Read: High Temperatures: 122 ఏళ్లలో ఎన్నడు చూడని వేడి.. ఎండలతో జాగ్రత్త సుమా?

గమనిస్తే.. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక ఫైట్ సీన్ ఉంటుంది. పైగా ఆ సీన్స్ అన్నీ ట్రాఫిక్ తో పాటు చిన్నపాటి గ్రాఫిక్స్ ను మిక్స్ చేసి ఉంటాయి. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా త్రివిక్రమ్ ఇదే తరహా ఫైట్ ను ప్లాన్ చేశాడు. మొత్తమ్మీద, త్రివిక్రమ్.. మహేష్ సినిమా కోసం చాలా రకాలుగా ఆలోచిస్తున్నాడు. అయితే, నటీనటుల ఎంపిక కూడా త్రివిక్రమ్ కి ఇప్పుడు అది పెద్ద సమస్య అయిపోయింది.

ఇప్పటికే, ‘ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్’ వంటి సినిమాలలో బాలీవుడ్ నటులు నటించారు. మరి మహేష్ సినిమాలో కూడా పాన్ ఇండియా స్టార్స్ లేకపోతే బాగోదు అని డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటి నుంచే త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో బడ్జెట్ అనుకున్న దాని కంటే రెండింతలు పెరిగే అవకాశం ఉంది. మరి నిర్మాతలు ఏ ధైర్యంతో ముందుకు పోతారో చూడాలి.

Sreeleela
Sreeleela

ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని, అలాగే పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూపిస్తారట. ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కాబోతుంది.

Also Read:OTT Super Hit Movie: థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్.. కానీ OTT లో బంపర్ హిట్.. ఎంత లాభాలు వచ్చాయో తెలుసా???

Recommended Videos:

Actress Samantha Spotted at Mumbai Airport || Samantha Latest Video || Oktelugu Entertainment

Ram Charan Confirms Multi Starrer Movie With Pawan Kalyan || Tollywood || Oktelugu Entertainment

Mega Star Chiranjeevi About Ram Charan Acting Skills || Acharya Movie || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

  1. […] Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ కి దగ్గర పడటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హడావుడి మొదలైపోయింది. ఆచార్యను సూపర్ హిట్ చేయడానికి అభిమానులు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కూడా వరుస ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా చిరు తన తర్వాత చిత్రాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. […]

Comments are closed.

Exit mobile version