https://oktelugu.com/

OTT Super Hit Movie: థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్.. కానీ OTT లో బంపర్ హిట్.. ఎంత లాభాలు వచ్చాయో తెలుసా???

OTT Super Hit Movie: వరుస విజయాలతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ కెరీర్ కి పెద్ద అడ్డుకట్ట వేసిన చిత్రం గని..గీత ఆర్ట్స్ బ్యానర్ లో కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడి దర్శకత్వ సారథ్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం, భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 01:55 PM IST
    Follow us on

    OTT Super Hit Movie: వరుస విజయాలతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ కెరీర్ కి పెద్ద అడ్డుకట్ట వేసిన చిత్రం గని..గీత ఆర్ట్స్ బ్యానర్ లో కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడి దర్శకత్వ సారథ్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం, భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం..విడుదల తర్వాత కనీసం నాలుగు కోట్ల రూపాయిలు కూడా వసూలు చెయ్యలేకపోయింది..బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్థాయి పరాజయం ని చవిచూసిన ఈ సినిమా కి OTT లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది అనే చెప్పాలి..ఇటీవలే ఈ సినిమాని ఆహా మీడియా లో విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..థియేటర్స్ లో జనాలు సినిమా చూడలేదు అని ఏమో తెలీదు కానీ ఈ మూవీ కి కేవలం 24 గంటల్లోనే ఒక్క సూపర్ హిట్ మూవీ కి వచ్చిన వ్యూస్ వచ్చాయి.

    Ghani

    అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్ వాచ్ హవర్స్ ని దక్కించుకున్నట్టు సమాచారం..ఈ స్థాయి వ్యూస్ ఇప్పటి వరుకు కేవలం సూపర్ హిట్ సినిమాలకు మాత్రమే వచ్చాయి అట.. కానీ ఒక్క ఫ్లాప్ మూవీ కి ఈ స్థాయి వ్యూస్ రావడం ఇదే తొలి సారి అని ఆహా మీడియా వారు చెప్తున్నా మాట..ఒక్కవేల సినిమా ని థియేటర్స్ లో కాకుండా నేరుగా OTT లోనే విడుదల చేసి ఉంటె ఎంతో మంది బయ్యర్లు సేఫ్ అయ్యేవారు అని ట్రేడ్ పండితుల అభిప్రాయం..సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఉండడం తో డైరెక్ట్ OTT విడుదల చేసి ఉంటె కచ్చితంగా ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చి ఉండేది అని , నిర్మాతకి కూడా లాభాలు మంచిగా వచ్చేవి అని ఇండస్ట్రీ లో వినిపిస్తూన్న టాక్..థియేటర్స్ లో విడుదల చేసి బయ్యర్లకు నష్టాలు రపించడమే కాకుండా నిర్మాతగా కూడా భారీ నష్టాలు తొలి సినిమాతోనే చూడాల్సి వచ్చింది అల్లు బాబీ కి..నిజంగా ఆయనది బాడ్ లక్ అనే చెప్పాలి.

    Also Read: Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, పవన్ కడుపున పవనే పుడతాడు !

    ఇది ఇలా ఉండగా ఈ సినిమా పరాజయం వరుణ్ తేజ్ ని చాలా తీవ్రంగా కలిచివేసింది..అభిమానులకు మరియు ప్రేక్షుకులకు క్షమాపణలు చెప్తూ ట్విట్టర్ లో ఒక్క బహిరంగ లేఖ కూడా రాసాడు వరుణ్ తేజ్..ఇక నుండి స్క్రిప్ట్ సెలెక్షన్స్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను అని..అభిమానులు నా సినిమాకి పెట్టే టికెట్ ఖర్చుకి కచ్చితంగా న్యాయం చేస్తాను అని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా మాట్లాడాడు..ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్ తో కలిసి F3 అనే చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..2018 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా F2 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ట్రేడ్ లి విపరీతమైన అంచనాలు ఉన్నాయి..ఎందుకంటే మొదటి భాగం అప్పట్లో ఎలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..రెండవ పార్ట్ మొదటి పార్ట్ కంటే అధికమైన ఎంటెర్టైమెంట్ దోసేజి ని బలంగా పెట్టాడు అట ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి..ఈ సినిమా తో వరుణ్ తేజ్ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.

    Also Read: Acharya: ఆచార్య సినిమా అనుకున్న సమయానికి వస్తుందా.. ఇప్పటికి ఎంతో బాలన్స్ ఉన్న వర్క్

    Tags