Horror in UP: కొందరు కామాంధుల ఆకృత్యాలకు చూస్తుంటే.. వీళ్లను మనుషులేనా లేక పశువులా అని అనిపించక మానదు. చిన్నపిల్లలను కూడా చూడకుండా.. తమ పశువాంచ తీర్చుకోవడం, ఆ తరువాత చంపేయడం లాంటి ఘటనలు చూస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మార్చి 7న జరిగిన ఓ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతోంది.

యూపీలోని ఎటవాక ప్రాంతానికి చెందిన ఓ బాలిక.. స్థానికంగా ఉన్న తమ పొలం వద్దకు వెళ్ళింది. బాలిక ఒంటరిగా వెళ్ళడం గమనించిన ఓ కీచకుడు ఆమెను వెంబడించాడు. రాత్రి కావస్తున్నా బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాభరా పడిపోయి చుట్టుపక్కల వెతికారు. ఆలస్యం అయ్యాక తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో బాలిక ఇంటికి వచ్చింది. జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది.
Also Read: ఐదు రాష్ట్రాల ఓటమి.. మొదటి పీసీసీ చీఫ్ సిద్ధూ ఔట్.. కాంగ్రెస్ ప్రక్షాళనే
బాలిక పొలం వద్దకు వెళ్లినప్పుడు.. ఆమెను వెంబడించిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో భయపడిపోయిన అతగాడు.. తన ముగ్గురు స్నేహితులకు సమాచారం ఇచ్చి రప్పించుకున్నాడు. వచ్చిన ఆ ముగ్గురు కూడా.. అపస్మారక స్థితిలో ఉంది అని చూడకుండా బాలికపై పశువుల్లాగా అత్యాచారం చేశారు.

వీరంతా కలిసి సామూహిక అత్యాచారం చేసిన తర్వాత బాలిక పూర్తిగా నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ నలుగురు కీచకులు కలిసి బాలికను అలీగడ్ మార్కెట్ ఏరియాలో వదిలి వెళ్లారు. ఇంటికి వచ్చిన బాలిక చెప్పిన వివరాలతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. కానీ పోలీసులు ముందుగా వారి ఫిర్యాదును తీసుకోలేదు. గ్రామస్తులు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన తర్వాత కేసును స్వీకరించారు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో సంచలనం రేపుతోంది. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.2వేల కోట్ల మోసం.. ఆర్బీఐ ముందుకు వివాదం