Extramarital Affair: ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే అసలు మనం మనుషులమేనా అని కొన్ని సార్లు అనుమానం రాకమానదేమో. వావి వరసలు మరిచి కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల చివరికి వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మామతో కోడలు, తమ్ముడి భార్యతో అన్న, అన్న భార్యతో తమ్ముడు ఇలా దారుణమైన సంబంధాలు పెట్టుకుని సంసారాలను విచ్చిన్నం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో కూడా వదిన మరిది చేసిన దారుణానికి.. ఓ కుటుంబం ముక్కలై పోయింది.

చెన్నై సిటీ లోని బ్రాడ్వే కాలనీలో నివసిస్తున్న రెహమాన్ కు 12 ఏళ్ల క్రితం యాస్మిన్ తో వివాహం జరిగింది. వీరికి ఓ కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య దాదాపు పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. రెహమాన్ కు ముగ్గురు సోదరులు ఉన్నారు. అందులో ఒక తమ్ముడు రసూల్ నిత్యం అన్న ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అన్న లేనప్పుడు ఇంటికి వస్తున్న రసూల్ కు వదినకు చదువు బాగా పెరిగిపోయింది.
Also Read: Congress Party: ఐదు రాష్ట్రాల ఓటమి.. మొదటి పీసీసీ చీఫ్ సిద్ధూ ఔట్.. కాంగ్రెస్ ప్రక్షాళనే
తన వయస్సుకు దగ్గరగా ఉన్న మరిదితో యాస్మిన్ మరింత దగ్గర కావడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో అతనికి వలపు వల విసిరింది. అసలే వయసు మీద ఉన్నాడు కదా ఆగుతాడా.. చాలా త్వరగానే వదిన మాయలో పడిపోయాడు. ఇంకేముంది ఇద్దరు కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. అన్న లేనప్పుడల్లా రసూల్ ఇంటికి రావడం.. వదినతో సరసాలు ఆడటం కామన్ అయిపోయింది.
వీరిద్దరు ఎంతగా మైకంలో మునిగితేలారు అంటే.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా తమ అక్రమ సంబంధాన్ని మూడేళ్లు కొనసాగించారు. రెహమాన్ కు ఎలాగూ రసూల్ తమ్ముడు కావడంతో ఎన్ని సార్లు ఇంటికి వచ్చి వెళ్తున్నా కూడా ఎవరూ పెద్దగా అనుమానించలేదు. ఈ దైర్యం తోనే వారు మరింతగా రెచ్చిపోయారు. కానీ పిల్లి కళ్ళు మూసుకుని ఎన్ని రోజులు పాలు తాగుతుంది చెప్పండి.. ఏదో ఒక రోజు దొరికి పోవాల్సిందే కదా.. ఆ సమయం రానే వచ్చేసింది.

ఒకరోజు మద్యం సేవించి వచ్చిన రెహమాన్ తన ఇంట్లో పడుకున్నాడు. అప్పటికే ఇంట్లో ఉన్న రసూల్ అన్న పడుకున్నాక.. వదిన తో రొమాన్స్ స్టార్ట్ చేశాడు. భర్త పక్క గదిలో ఉన్నా కూడా ఏ మాత్రం భయపడకుండా యాస్మిన్ మరిదితో ఎంజాయ్ చేస్తోంది. సడన్ గా అర్ధరాత్రి నిద్రలేచిన రెహమాన్ భార్య, తమ్ముడి సరసాలు చూసి రగిలిపోయాడు.
ఇద్దరిని చావగొట్టాడు. కానీ వారు మాత్రం తమ తీరు మార్చుకోలేదు. రెహమాన్ లేనపుడల్లా బయట సరసాలు స్టార్ట్ చేశారు. తాను ఎంత చెప్పినా వినక పోవడంతో.. పెద్దమనుషుల దగ్గర పంచాయితీ పెట్టాడు రెహమాన్. కానీ యాస్మిన్ మాత్రం మరిదితో సరసాలు ఆపడానికి అస్సలు ఒప్పుకోలేదు. తన తల్లి ఎన్నిసార్లు చెప్పిన యాస్మిన్ మాత్రం వినలేదు. దీంతో ఇక లాభం లేదనుకున్న రెహమాన్ భార్యను అడ్డు తొలగించాలి అనుకున్నాడు.
ఒకరోజు నిద్రపోతున్న యాస్మిన్ గొంతు నులిమి చంపేశాడు. ముందుగా భార్య ఆత్మహత్య చేసుకుందంటూ కట్టుకథ అల్లాడు. కానీ అందరికీ నిజం తెలిసిపోయింది. ఇక భార్య వల్ల తన పరువు పోయిందని బాధ పడ్డ రెహమాన్ తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కొన ఊపిరితో ఉండగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్ళి అతన్ని బతికించారు. అయితే ఇంత ఘనకార్యం జరగడానికి కారణమైన రసూల్.. ఇంటి నుంచి పారిపోయాడు.
Also Read: Sajjanar Tweet About RRR: ఎత్తరజెండా పాటను కూడా వదలని సజ్జనార్.. ఇలా వాడేశాడే